నిశ్చితార్థం చాలా ప్రశాంతంగా సూపర్ గా జరిగింది. ఆ విషయంలో నేను హ్యాపీ అని శోభిత తెలిపింది. సాంప్రదాయాలు అంటే నాకు చాలా ఇష్టం. అదే విధంగా కుటుంబ సభ్యులని, మన సంస్కృతిని ఎంతగానో గౌరవిస్తాను. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలి అని ఎప్పుడూ కోరుకునేదాన్ని. మాతృత్వం అంటే తనకి ఎంతో ఇష్టం అని శోభిత పేర్కొంది.