'మంగళవారం' డైరెక్టర్ కి బంపర్ ఆఫర్.. స్టార్ హీరో కొడుకుతో భారీ బడ్జెట్ చిత్రం ?

First Published | Sep 25, 2024, 7:57 PM IST

ఇండస్ట్రీలో రాణిస్తున్న డైరెక్టర్స్ లో రాంగోపాల్ వర్మ శిష్యులు చాలా మంది ఉన్నారు. వారిలో అజయ్ భూపతి ఒకరు. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో ఘనవిజయం అందుకున్న అజయ్ భూపతి టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.

ajay bhupathi

ఇండస్ట్రీలో రాణిస్తున్న డైరెక్టర్స్ లో రాంగోపాల్ వర్మ శిష్యులు చాలా మంది ఉన్నారు. వారిలో అజయ్ భూపతి ఒకరు. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో ఘనవిజయం అందుకున్న అజయ్ భూపతి టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఆ తర్వాత మహా సముద్రం చిత్రం డిజాస్టర్ అయింది. 

మరోసారి పాయల్ రాజ్ పుత్ తో తెరెకెక్కించిన మంగళవారం హిట్ అయింది. ఆస్కార్ నామినేషన్స్ కి పంపించే చిత్రాల పరిశీలన లిస్ట్ లో మంగళవారం కూడా చోటు దక్కించుకుంది అంటే ఎంతలా విమర్శకులని ఈ చిత్రం మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. 


అజయ్ భూపతి మంగళవారం 2 కూడా తీస్తానని అనౌన్స్ చేశారు. అయితే తాజాగా అజయ్ భూపతికి బంపర్ ఆఫర్ దక్కినట్లు టాక్. అజయ్ భూపతి ఏకంగా స్టార్ హీరో కొడుకుతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

ఆ స్టార్ హీరో కొడుకు ఎవరో కాదు ధృవ్. విలక్షణ నటుడు విక్రమ్ తనయుడిగా ధృవ్ హీరో అయ్యాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాడు. అజయ్ భూపతితో వైవిధ్యమైన కథతో భారీ బడ్జెట్ చిత్రంలో ధృవ్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Latest Videos

click me!