రజనీకాంత్‌ని ఇలా చూసి ఉండరు, `వేట్టయన్‌` ప్రివ్యూ వీడియో ఎలా ఉందంటే?

First Published Sep 25, 2024, 8:12 PM IST

రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న మూవీ `వేట్టయన్‌` తెలుగు వర్షన్‌ ప్రివ్యూ విడుదలైంది. ఇందులో సూపర్‌ స్టార్‌ గతంలో ఎప్పుడూ చూడని కొత్త అవతార్‌లో కనిపిస్తున్నారు. 
 

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ సినిమా అంటే భారీ ఎలివేషన్లు, అదిరిపోయే డైలాగులు, యాక్షన్‌ సీన్లు, అంతకు మించిన ఆయన మార్క్ స్టయిల్‌ కనిపిస్తుంటుంది. ఏ సినిమా అయినా ఇవన్నీ ఉండాల్సిందే. చివరగా వచ్చిన `జైలర్‌`లోనూ ఇవి పుష్కలంగా ఉన్నాయి. సినిమా భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కానీ ఇప్పుడు రజనీ పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాడు. సరికొత్త సూపర్‌ స్టార్‌ కనిపిస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్‌ `వేట్టయన్‌` అనే చిత్రంలో నటిస్తున్నారు. `ది హంటర్‌` అనేది ట్యాగ్‌ లైన్‌. `జై భీమ్‌` ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ ఈ మూవీని రూపొందిస్తున్నారు. దసరాకి సినిమా విడుదల కానుంది. 

 బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

ఈ నేపథ్యంలో ప్రివ్యూ పేరుతో `వేట్టయన్‌` మూవీ టీజర్‌ని విడుదల చేశారు. టీజర్‌ని తలపించేలా ఉన్న ఈ ప్రివ్యూలో రజనీకాంత్‌ క్యారెక్టర్ తీరుతెన్నులను చూపించారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని టాప్ మోస్ట్ సీనియ‌ర్ ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌ల ఫొటోలు చూపిస్తూ.. ఈ ఆఫీస‌ర్స్ ఎవ‌రో మీకు తెలుసా! అని స‌త్య‌దేవ్ (అమితాబ్ బ‌చ్చ‌న్‌) అడుగుతారు.

వీళ్లు పేరు మోసిన ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్ అని ట్రైనింగ్‌లోని ఓ ఆఫీస‌ర్ స‌మాధానం చెబుతారు. ‘ఈ దేశంలో ల‌క్ష‌లాది మంది పోలీసులున్నారు.. కానీ వీళ్ల‌ని మాత్రం చూడ‌గానే గుర్తుప‌డుతున్నారంటే!.. అదెలా సాధ్యం’ అని మ‌ళ్లీ ప్ర‌శ్న‌వేయ‌గా.. ట్రైనింగ్ తీసుకుంటోన్న మ‌రో లేడీ ఆఫీస‌ర్ ‘మోస్ట్ డేంజరస్ క్రిమినల్స్‌ని భ‌య‌ప‌డ‌కుండా ఎన్‌కౌంట‌ర్స్ చేయ‌టం వ‌ల్ల వీళ్లు హీరోస్ అయ్యారు’ అని స‌మాధానం చెబుతుంది. 
 

Latest Videos


మ‌ధ్య మ‌ధ్య‌లో మ‌న క‌థానాయ‌కుడు వేట్ట‌య‌న్ (ర‌జినీకాంత్‌) త‌న డ్యూటీలో ఎంత ప‌వ‌ర్‌ఫుల్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఎన్‌కౌంట‌ర్స్ ఎలా చేశార‌నే స‌న్నివేశాల‌ను చూపిస్తూ వ‌చ్చారు. ‘మ‌న‌కు ఎస్‌.పి అనే పేరు మీద ఒక యముడొచ్చి దిగినాడు’ అని నేరస్థులు రజినీకాంత్ అంటే భయపడుతుంటారు. విల‌న్స్ వేట్ట‌య‌న్ పేరు చెబితేనే హ‌డ‌లిపోతుంటారు. డీల్ చేయ‌టానికి భ‌య‌ప‌డుతుంటారు. 
 

రౌడీయిజం పేరు చెప్పి ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్న వారిని వేట్ట‌య‌న్ వేటాడుతుంటాడని ప్రివ్యూ స‌న్నివేశాల్లో చూపిస్తూ వ‌చ్చారు. ఇక ఫ‌హాద్ ఫాజిల్, దుసారా విజ‌య‌న్‌, ప్ర‌తినాయ‌కుడిగా న‌టించిన రానా ద‌గ్గుబాటి, అభిరామి, మంజు వారియ‌ర్‌ పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేశారు. అస‌లు వీళ్ల పాత్ర‌ల‌కు, వేట్ట‌య‌న్‌కు ఉన్న సంబంధం ఏంటి?

ఎన్ కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌గా ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న వేట్ట‌య‌న్ జీవితంలో ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నార‌నే విష‌యాలు తెలుసుకోవాలంటే ‘వేట్టయన్- ద హంట‌ర్‌’ సినిమా చూడాల్సిందే. అయితే రజనీ నుంచి ఆశించే మాస్‌ డైలాగులు, స్టయిల్‌లో కాకుండా ఓ బలమైన కంటెంట్‌తో ఈ సినిమాని తెరకెక్కించినట్టు ఈ ప్రివ్యూ చూస్తుంటే అర్థమవుతుంది. ఇటీవల ఆయన ఈవెంట్‌లో చెప్పినట్టుగానే కంప్లీట్‌గా ఓ కొత్త రజనీని చూడొచ్చని అర్థమవుతుంది. 
 

రజనీకాంత్‌, లైకా బ్యానర్‌లో వస్తోన్న నాల్గో మూవీ ఇది. గతంలో `2.0`, `ద‌ర్బార్‌`, `లాల్ స‌లామ్` వంటి చిత్రాలు వచ్చాయి. అలాగే `పేట‌`, `ద‌ర్బార్‌`, `జైల‌ర్` చిత్రాల‌కు అదిరిపోయే ట్యూన్స్, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందించి మెప్పించిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ ర‌విచంద‌ర్ నాలుగోసారి సంగీతం అందించిన సినిమా కావ‌టంతో ‘వేట్టయన్- ద హంట‌ర్‌’పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.  
 

ర‌జినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ‘వేట్టయన్- ద హంట‌ర్‌’ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్, రానా ద‌గ్గుబాటి, రితికా సింగ్‌, దుష‌రా విజ‌య‌న్, రోహిణి, అభిరామి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఆడియెన్స్‌కు స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వ‌టానికి సిద్ధ‌మ‌వుతోన్న ఈ పాన్ ఇండియా సినిమా త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ భాషల్లో అక్టోబర్‌ 10 దసరా కానుకగా విడుదల కానుంది.  
 

click me!