ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన `వార్ 2` సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సినిమా సింపుల్‌గా బ్లాక్ బస్టర్ అని తేలిపోయింది. హైలైట్స్ ఏంటో కూడా లీక్ అయ్యాయి.
ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ నటించిన సినిమా `వార్ 2`. హృతిక్ రోషన్ మరో హీరోగా నటించిన ఈ భారీ మల్టీస్టారర్ చిత్రానికి బాలీవుడ్‌లో స్పై యాక్షన్ మూవీస్‌కి కేరాఫ్‌గా నిలిచిన అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ మరో రెండు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. హిందీ, తెలుగుతోపాటు పాన్ ఇండియా తరహాలో రిలీజ్ చేస్తున్నారు.
DID YOU KNOW ?
హృతిక్‌కి అభిమాని
ఎన్టీఆర్ బెస్ట్ డాన్సర్. కానీ ఆయన హృతిక్ రోషన్ డాన్సులకు అభిమాని. ఈ విషయంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ఇటీవల `వార్ 2` ఈవెంట్‌లోనూ ఆ విషయాన్ని ప్రస్తావించారు.
24
రెండు కాలర్స్ ఎగరేసి సినిమాపై హైప్ పెంచిన ఎన్టీఆర్
మొన్నటి వరకు మూవీపై పెద్దగా అంచనాలు లేవు. టీజర్, ట్రైలర్ పెద్దగా ఆకట్టుకునేలా అనిపించలేదు. బాలీవుడ్ సినిమాలు మనకు పెద్దగా ఎక్కవు. కొన్ని సినిమాలే ఆకట్టుకుంటాయి. పైగా ఇలాంటి స్పై యాక్షన్ మూవీస్‌పై మన తెలుగు ఆడియెన్స్ పెద్దగా ఆసక్తి చూపరు. కానీ ఎన్టీఆర్ ఉండటంతో దీనికి క్రేజ్ పెరిగింది. ట్రైలర్, టీజర్‌లో రెగ్యూలర్ కంటెంట్ కనిపించడంతో హైప్ రాలేదు. కానీ ఇటీవల హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో సినిమాపై హైప్ పెంచారు తారక్. ఆయన రెండు కాలర్స్ ఎగరేసి చెప్పారు బొమ్మ బ్లాక్ బస్టర్ అని. ఎన్టీఆర్ నుంచి ఇలాంటి కామెంట్ చాలా అరుదు. బాగుంటేనే చెబుతారు. ఆయన చెప్పారంటే బాగున్నట్టే. దీంతో `వార్ 2`కి బజ్ క్రియేట్ అవుతుంది.
34
`వార్ 2` ఫస్ట్ రివ్యూ
ఈ క్రమంలో తాజాగా `వార్ 2` సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చింది. ఓవర్సీస్ క్రిటిక్‌గా చెప్పుకునే ఉమైర్ సందు సోషల్ మీడియా ద్వారా ఈ మూవీ ఎలా ఉండబోతుందో తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా బ్లాక్ బస్టర్ అని వెల్లడించారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని, యాక్షన్ సీన్లు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయన్నారు. అలాగే ఈ ఇద్దరు కలిసి చేసే డాన్స్ వాహ్ అనిపిస్తుందని, కళ్లు తిప్పుకోవడం కష్టమే అని తెలిపారు. పాటలోనే కాదు, నటన పరంగానూ ఇద్దరూ ఆడియెన్స్ చూపు తిప్పుకోనివ్వరు అని వెల్లడించారు. కియారా అద్వానీ కేవలం గ్లామర్ పరంగానే ఆకట్టుకుందని తెలిపారు.
ఇక ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ అదిరిపోయిందన్నారు ఉమైర్ సందు. తారక్ కళ్లు చాలా పవర్‌ఫుల్ అని, కళ్లతోనే యాక్ట్ చేశాడని తెలిపారు. ఇంకోవైపు ఈ చిత్రంతో బాలీవుడ్‌లో ఆయన పాగా వేయడం పక్కా అని, ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోతుందని చెప్పారు. సినిమాకి విజువల్స్ బాగున్నాయని, అంతిమంగా బొమ్మ సూపర్ షాట్ హిట్ అని స్పష్టం చేశారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. బేసిక్‌గా ఉమైర్ సందు వివాదాస్పద అంశాలతో రచ్చ చేస్తుంటారు. నెగటివ్ రివ్యూస్ పెట్టేవారు. కానీ ఇప్పుడు చాలా వరకు రియాలిటీకి దగ్గరగా ఉండే రివ్యూలు పెడుతున్నాడు. దీంతో ఆయనపై పాజిటివిటీ పెరిగింది. `వార్ 2` విషయంలోనూ ఆయన చెప్పింది నమ్ముతున్నారు. మరి ఆయన చెప్పినట్టుగానే మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందా? అనేది మరో రెండు రోజుల్లో తేలనుంది.