ఇటీవల చిరంజీవి ఊటీలో ఒక ల్యాండ్ కొన్నారు. అక్కడ మరో ఫార్మ్ హౌస్ నిర్మించాలనేది ఆయన ఆలోచన. వ్యాపారవేత్తలు, ప్రముఖులు, ధనవంతులు ఊటీలో ల్యాండ్ కొని ఫార్మ్ హౌస్ నిర్మించుకుంటారు. ఖాళీ సమయంలో అక్కడకు వెళ్లి సేద తీరుతారు. అనేక మంది నటులకు ఊటీలో ఫార్మ్ హౌస్లు ఉన్నాయి.
చిరంజీవి రూ. 16 కోట్లు పెట్టి ఊటీలో స్థలం కొన్నారట. రామ్ చరణ్, ఉపాసన కూడా ఆ స్థలాన్ని సందర్శించారట. బెంగుళూరు, హైదరాబాద్ కోకాపేట, ఊటీ ప్రాంతాల్లో చిరంజీవికి ఉన్న ఈ మూడు ఫార్మ్ హౌస్ల విలువ రూ. 256 కోట్లు అని ఒక అంచనా.