నిజంగా శోభన్ బాబు, జయలలిత కి పిల్లలు పుట్టారా, వాళ్ళని సీక్రెట్ గా పెంచారా, ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారు?

Published : Feb 12, 2025, 05:41 PM ISTUpdated : Feb 12, 2025, 06:01 PM IST

Sobhan Babu Jayalalithaa  Secret Relationship:  అందాల నటుడు శోభన్ బాబు, జయలలిత ఇద్దరు ప్రేమించుకున్నది నిజమేనా? వాళ్ళిద్దరికి పిల్లలు కూడా పుట్టారా.? వాళ్ళను సీక్రేట్ గా పెంచింది ఎవరు? వాళ్ళు ఇప్పుడేం చేస్తున్నారు? అసలు ఈ వార్తల్లో నిజం ఎంత.? 

PREV
15
నిజంగా శోభన్ బాబు, జయలలిత కి పిల్లలు పుట్టారా, వాళ్ళని సీక్రెట్ గా పెంచారా, ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారు?
Sobhan Babu, Jayalalithaa

Sobhan Babu Jayalalithaa  Secret Relationship: అందాల నటుడు శోభన్ బాబు అంటే అప్పట్లో అమ్మాయిలు  తెగప్రేమించేవారట. ఇక హీరోయిన్లు కూడా శోభన్ బాబుతో నటించడం అంటే ఎంతో క్రేజీగా ఫీల్ అయ్యేవారట. అలా శోభన్ బాబుతో నటించిన హీరోయిన్లు చాలామంది ఉండగా.. వారిలో కొదరు హీరోయిన్లతో శోభన్ బాబు ప్రేమాయణం నడిపించారన్న రూమర్లు కూడా ఉన్నాయి.

మరీ ముఖ్యంగా జయలలితతో శోభన్ బాబు రిలేషన్ పై రకరకాల వార్తలు వైరల్ అవుతూ వచ్చాయి. అయితే జయలితను శోభన్ బాబు పెళ్ళి చేసుకున్నాడని, సీక్రేట్ గా కాపురం చేసి పిల్లన్ని కూడా కన్నారని ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. 

Also Read: నాగచైతన్య బాగా నచ్చిన నాగార్జున రెండు సినిమాలు, సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్న అక్కినేని యంగ్ హీరో
 

25
Sobhan Babu, Jayalalithaa

జయలలిత శోభన్ బాబుకు ప్రేమగా వండిపెడుతున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. కాని వీరు నిజంగా పెళ్లి చేసుకున్నారా..? పిల్లల్ని కంటే వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు. జయలలిత మరణం తరువాత కూడా వారు బయటకురాకపోవడానికి కారణం ఏంటి..? ఈ విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తుంటాయి. అసలు జయలలితతో శోభన్ బాబు రహస్యంగా కాపురం చేశారు అనడానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు. 
 

Also Read: సుమన్ ను బ్లూ ఫిలిం కేసులో ఇరికించిన ముఖ్యమంత్రి ఎవరు? అందులో చిరంజీవి పాత్ర ఏమిటి?

35

అంతే కాదు వారికి పిల్లలు పుట్టారని. మరీ ముఖ్యంగా వారికి ఒక ఆడపిల్ల ఉందని. ఆమెను జయ చాలా సీక్రేట్ గా పెంచారని ఇలా రకరకాల  వాదనలు ఉన్నాయి. ఈ ఇద్దరు స్టార్లు కలిసి చాలా సినిమాల్లో నటించారు. చాలా క్లోజ్ గా కూడా ఉండేవారట. 

ఒక వేళ ఇదే నిజం అయితే.. జయలలిత తన వారసురాలిగానో.. లేక తన దగ్గరి వ్యక్తిగానో చూసుకుంటూ.. ఆమెను ఎలాగొల వారసురాలిని చేసేది కదా. ఎక్కడో క్యాసెట్ సెంటర్ నడుపుకునే శశికళను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకువచ్చిన జయ.. తన కూతురిని వదిలేయదు కదా..? కూతురు ఉండి ఉంటే.. జయలలిత మరణం తరువాత  అయినా బయటకువచ్చేది కదా. ఇలా ఎన్నో ప్రశ్నలు. 
 

45

ఇలా అనేక ప్రశ్నలు లేవనెత్తారు కొంత మంది సినిమా పెద్దలు. కాని వీరికి పిల్లలు ఉన్నారు అనేందుకు ఎటువంటి ఆధారాలులేవు. ఈ వార్తలన్నీ రూమర్లు గానే మిగిలిపోయాయి.   అంతే కాదు అప్పట్లో జయలలిత శోభన్ బాబుపై మనసు పడటం నిజమే అంటుంటారు. శోభన్ బాబుతో ఎక్కవ సినిమాలు చేయడానికి కూడా ఆమె ఇంట్రెస్ట్ చూపేవారట.  

కాని అప్పటికే పెళై పిల్లలు ఉన్న శోభన్ బాబు జయలలితను పెళ్లాడటానికి నిరాకరించారని.. దాంతో జయ జీవితాంతం బ్యాచిలర్ గా ఉండిపోయిందని, ఆమె అలా ఉండటానికి  కారణం ఇదే అంటుంటారు. ఇక మరో వాదన ఏంటంటే..? శోభన్ బాబు జయలలిత పెళ్లికి సిద్దం అయ్యారని. 
 

55

కాని అప్పుడు జయలలిత పొలిటికల్ గా.. సినిమాల పరంగా చాలా క్లోజ్ గా ఉండే మాజీ ముఖ్యమంత్రి ఎమ్జీ రామచంద్రన్ వీరి పెళ్ళి జరగకుండా ఆపారని టాక్ కూడా ఉంది. ఏది నిజమో తెలియదు కాని.. వీరి బంధం గురించి ఇప్పటికీ నిజం ఎవరికీ తెలియదు. కొన్ని వార్తా కథనాల ప్రకారం పోయోస్ గార్డెన్ లో ఉన్న జయలలిత ఇంటికి శోభన్ బాబు అప్పుడప్పుడు వెళ్ళేవారట. ఈ విషయంలో శోభన్ బాబును ఆయన  భార్య వ్యతిరేకించేవారని అంటుంటారు. నిజమేంటి అనేది ఇప్పటి వరకూ తెలియదు. రూమర్స్ మాత్రం చాలా ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories