ఇక ఇందులో విశ్వక్ సేన్ నటన వేరే లెవల్‌లో ఉండబోతుందట. ముఖ్యంగా `లైలా` పాత్రలో ఆయన ఇరగదీశాడట. అమ్మాయిగా మారి విశ్వక్ చేసే రచ్చ అదిరిపోయేలా ఉంటుందని, అదే సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని, కామెడీ హిలేరియస్‌గా ఉంటుందని తెలుస్తుంది. ప్రేమికులకు రోజున ఇది సరైన ఎంటర్‌టైనర్ అవుతుందని టీమ్ నుంచి తెలుస్తున్న సమాచారం.
కామెడీ, డైలాగ్‌లు, లైలా ఎపిసోడ్ సినిమాకి హైలైట్స్ అని తెలుస్తుంది. అలాగే హీరోయిన్ ఆకాంక్ష సింగ్‌గ్లామర్, వెన్నెల కిశోర్, బబ్లూ పృథ్వీరాజ్ బ్రహ్మాజీ ఫన్ వర్కౌట్ అయ్యిందని తెలుస్తుంది. మరి విశ్వక్ `లైలా`గా ఏ మేరకు ఆకట్టుకుంటాడో మరో రెండు రోజుల్లో తేలనుంది. ఈ చిత్రాన్ని రాహుల్ యాదవ్ నిర్మించారు.