తెలుగు చిత్ర పరిశ్రమలో సోగ్గాడు అంటే శోభన్ బాబు. అప్పట్లోనే విపరీతంగా మహిళా అభిమానుల ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరో ఆయన. శోభన్ బాబు.. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ తరహాలో టాలీవుడ్ లో అగ్ర హీరోగా ఎదిగారు. ఎలాంటి క్యారెక్టర్ రోల్స్ చేయకుండా హీరోగానే రిటైర్మెంట్ తీసుకున్నారు. ప్రేక్షకుల హృదయాల్లో హీరోగానే మిగిలిపోవాలి అనేది ఆయన ఆలోచన.