ఇక ఫోర్త్ అవినాష్. టికెట్ టు ఫినాలే గెలుచుకున్న అవినాష్ ఫైనల్ కి వెళ్ళాడు. అవినాష్ మంచి ఎంటర్టైనర్. బాగా నవ్విస్తాడు. అయితే అవినాష్ ఎలాంటి వాడో అర్థం కాదు. అతని నిజ స్వరూపం నాకు తెలియ లేదని ఆదిత్య ఓం వీడియోలో చెప్పారు. ఇక ఫైనల్ గా నబీల్ కూడా గ్రాండ్ ఫినాలేకి వెళతాడని అంచనా వేశాడు. నబీల్ లో కొంత అపరికత్వత, పిల్లల మనస్తత్వం ఉన్నాయి. కానీ మంచి ప్లేయర్. తనకు వయసు పెరిగే కొద్దీ మెచ్యూరిటీ వస్తుంది.. కెరీర్లో ఎదుగుతాడు... అని ఆదిత్య ఓం వెల్లడించారు .
కాబట్టి.. ఆదిత్య ఓం అభిప్రాయంలో టాప్ 5 ఎవరంటే... నిఖిల్, గౌతమ్, ప్రేరణ, అవినాష్, నబీల్. పరోక్షంగా నిఖిల్ విన్నర్ అని ఆయన చెప్పారు. కాగా విష్ణుప్రియకు చోటు దక్కలేదు. ఆదిత్య ఓం అంచనా ప్రకారం వ్ విష్ణుప్రియ ఫైనల్ కి కూడా వెళ్ళదు. ఈ వారం ఆమె ఎలిమినేట్ అవుతుందట.