40ఏళ్ల క్రితమే 10 లక్షలు వదిలేసిన రజనీకాంత్‌, అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనందుకు డేరింగ్‌ డెసీషన్‌

First Published | Dec 4, 2024, 10:40 AM IST

రజినీకాంత్ సినిమాలో నటించినందుకు రావాల్సిన పారితోషికంలో 10 లక్షలు వదులుకున్నారు. నలభై ఏళ్ల క్రితమే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. 

రజినీ

సూపర్ స్టార్ రజినీకాంత్..  సినిమాలో 49 ఏళ్లుగా స్టార్ హీరోగా రాణిస్తున్నారు. 1975లో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన `అపూర్వ రాగంగళ్` సినిమాతో తన కెరీర్ మొదలుపెట్టారు. సినిమా రంగంలో ఆయన సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు. స్టయిల్‌ కి కింగ్‌  అనిపించుకుంటున్నాడు. 

రజినీకాంత్

మూడు తరాల నటులతో నటించినా, కొత్త హీరోలకు పోటీగా నిలుస్తున్నారు రజినీకాంత్. 74 ఏళ్ళ వయసులో కూడా యాక్టివ్ గా నటిస్తున్నారు. నటనతో పాటు మంచి వ్యక్తత్వంలోనూ తాను బెస్ట్ అనిపించుకుంటాడని, ఆయనది గొప్ప మనసు అని ఆ చిత్ర నిర్మాత వెల్లడించడం విశేషం. 


దర్బార్

1983లో జగన్నాథన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా "తంగమగన్". ఈ సినిమాలో రజినీకాంత్ హీరో. రజినీ కెరీర్ లో హిట్ సినిమాల్లో ఇది ఒకటి. షూటింగ్ జరుగుతున్నప్పుడు రెండు నెలలు రజినీకాంత్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో షూటింగ్ ఆలస్యమైంది.

తంగ మగన్

ఆరోగ్యం కుదుటపడ్డాక రజినీకాంత్ మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అయ్యి సినిమా పూర్తి చేశారు. సినిమా హిట్ అయ్యాక, నిర్మాతలు రజినీకాంత్ కి 10 లక్షల రూపాయల పారితోషికం ఇవ్వడానికి వెళ్లారు. అప్పుడు రజినీకాంత్, తాను రెండు నెలలు షూటింగ్ కి రాలేకపోవడంతో నిర్మాతలకు నష్టం జరిగిందని, అందుకే ఆ 10 లక్షలు వద్దని, తాను తీసుకున్న అడ్వాన్స్ చాలు అని చెప్పి నిర్మాతల కష్టాన్ని అర్థం చేసుకున్నారు. రజనీ నిర్ణయానికి ఆ నిర్మాతలు ఫిదా అయిపోయారు. ఈ విషయాన్ని ఆ మూవీ నిర్మాత ఓ పాత ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం. 

Latest Videos

click me!