మహేష్ బాబు ఫ్యాన్స్ కు రాజమౌళి స్ట్రాంగ్ వార్నింగ్, తేడా వస్తే ఊరుకోడట..?

First Published | Sep 13, 2024, 6:09 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు టాలీవుడ్ జక్కన్న రాజమౌళి. ఇంతకీ ఈ పని ఆయన ఎందుకు చేశారో తెలిస్తే షాక్ అవుతారు. 
 

బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతమై సినిమాల తరువాత అంతకు మించిన సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు దర్శఖుడు రాజమౌళి. మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమాకు జక్కన్న అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్న ఈసినిమా ఓపెనింగ్ ఎప్పుడనేది త్వరలో తెలియబోతుంది. 

ప్రభాస్ కల్కి 2898 AD నుంచి ఎవరు చూడని అరుదైన ఫోటోలు..

ఇక ఇప్పటికే ఈసినిమా కోసం తన లుక్ ను కంప్లీట్ గా మార్చేసుకున్నాడు మహేష్ బాబు. రీసెంట్ గా ఫారెన్ నుంచి వచ్చిన మహేష్... న్యూ లుక్ ను కనిపించకుండా మ్యానేజ్ చేశాడు.. కాని లాంగ్ హెయిర్ తో.. గడ్డెం పెంచుకుని  ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు. ఇక ఈసినిమా ఓపెనింగ్ త్వరలోనే ఉండొచ్చన్న టాక్ నడుస్తోంది. 

SSMB29 వర్కింగ్ టైటిల్ తో రూపొందబోతున్న  ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ ప్రకటన త్వరలో రాబోతున్నట్టు సమాచారం. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో  శ్రీ దుర్గా ఆర్ట్స్’ బ్యానర్ పై కే.ఎల్.నారాయణ్, ఎస్.గోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే ముమ్మరంగా జరుగుతుంది. 

అల్లు అర్జున్ పై మలయాళ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్


అంతే కాదు రెండు బాగాలుగా ఈసినిమా ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నడట రాజమౌళి. బడ్డెట్ తో పాటు.. ఈసారి టైమ్ కూడా క్రాస్ చేయకుండా జాగ్రత్తపడుతున్నాడట రాజమౌళి.దాదాపుగా ఈసినిమా ఫస్ట్ పార్ట్ ను 2026 లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఇక రాజమౌళి సినిమా అటే చాలా కాలం పడుతుంది. 

అలాంటిది మహేష్ బాబుతో సినిమా అంటే.. ఎన్నాళ్లకు పూర్తి అవుతుంది.. ఈసినిమాకు సబంధించి అప్ డేట్స్ ఏంటి.. ఎప్పుడు ప్రకటిస్తారు.. ఏమేం ఇస్తారు.. లాంటి ప్రశ్నలు సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి.. రిలీజ్ వరకూ ప్రేక్షకుల నుంచి వస్తూనే ఉంటాయి. అటువంటి వాటికి రాజమౌళి ముందే సమాధానం చెప్పారు. అది కూడా చాలా ఘాటుగా. 

స్టార్ హీరో సినిమా అంటే అప్ డేట్స్ కోసం గట్టిగా ప్రెజర్ వస్తుంది. కాస్త లేటు అయినా.. సోషల్ మీడియాలో ట్రోల్స్.. ప్రెజర్ తప్పదు. అందుకే అవన్నీ ముందే ఊహించి రాజమౌళి ఇండైరెక్ట్ గా మహేష్ ఫ్యాన్స్ కు గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 

సినిమా చేయాలి అంటే చాలా టైమ్ పడుతుంది. పాన్ వరల్డ్ మూవీ..కావడంతో చాలా జాగ్రత్తగా చేయాలి. ఆ టైమ్ లో ఇలాంటి చికాకులు ఉంటే కష్టం అందుకే ముందేఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చేస్తున్నాడట జక్కన్న. 

ఈక్రమంలో రాజమౌళి తాజాగా  మత్తు వదలరా 2 ప్రమోషన్స్ లో భాగంగా హీరో సింహా కోడూరి , కాలభైరవ ..లతో రాజమౌళి పాల్గొన్నారు. మధ్యలో హీరో సింహా ‘SSRMB’ ప్రాజెక్టు గురించి అప్డేట్ కావాలని అడిగాడు. 

దానికి రాజమౌళి పెద్ద కర్ర తీసుకుని వారిని పరిగెత్తిస్తున్నట్టు ఓ వీడియో వైరల్ అవుతుంది. అంటే అప్డేట్ అంటూ మారాం చేసే మహేష్ అభిమానులందరికీ రాజమౌళి ఇలా సమాధానం చెప్పినట్లు అర్థం చేసుకోవచ్చు.

మొన్నటికి మొన్న దర్శకుడు అనిల్ రావిపూడి  కూడా అప్డేట్ అడిగితే.. అనిల్ రావిపూడిని ముసుగేసి కొట్టి వీడియో తీసిన వాళ్ళకి డబ్బులు ఇస్తానని’ రాజమౌళి  చెప్పిన సంగతి తెలిసిందే. సో ఈ ప్రాజెక్టు విషయంలో రాజమౌళి ఎంత సీరియస్ గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈమూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ నుంచి స్టార్ ను తీసుకోబోతున్నారట. దీపికా పదుకొనే, కృతీ సనన్ లాంటి మరికొంత మంది స్టార్ హీరోయిన్ల పేర్లు ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మరికొంత కాలం ఆగక తప్పదు. 
 

Latest Videos

click me!