కేరళలో పుట్టిన నయనతార చిన్నవయసులోనే మలయాళ టీవీ ఛానెల్స్‌లో యాంకర్‌గా పనిచేసింది. ఆ తరువాత, మలయాళ చిత్రాలలో నటించడం ప్రారంభించారు నయన్. కాని నయనతార మొదటి కోలీవుడ్ అవకాశం ప్రముఖ స్టార్ శరత్‌కుమార్‌తో వచ్చింది.
2005 సంవత్సరంలో విడుదలైన "అయ్యా" చిత్రం ఆమె ఫస్ట్ మూీ. ఆ సినిమా తర్వాత తన రెండో సినిమా చంద్రముఖిలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి హీరోయిన్‌గా అవకాశం వచ్చింది.
తమిళ చిత్ర పరిశ్రమలో మెల్లగా ఎన్నో మంచి చిత్రాల్లో నటించడం ప్రారంభించిన నటి నయనతార చాలా తక్కువ కాలంలోనే కమల్ మినహా దాదాపు తెలుగు, తమిళ చిత్రసీమలోని ప్రముఖ నటీనటులందరితోనూ నటించింది.
దాదాపు 20 ఏళ్ళుగా హీరోయిన్ గా కోనసాగుతూ.. నయనతార లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదగింది. రిసెంట్ గా నయనతార 75వ సినిమా రిలీజ్ అయ్యింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.