ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్న స్నేహ.. అసలు రహస్యం బయటపెట్టిన క్రిటిక్‌

Published : Sep 28, 2023, 09:47 PM ISTUpdated : Sep 29, 2023, 05:23 PM IST

హోమ్లీ బ్యూటీగా తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్‌ స్నేహ. ఆమె నటుడు ప్రసన్నని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఆమె ముందే ఓ వ్యక్తిని ప్రేమించిందట. ఎంగేజ్‌మెంట్ వరకు వెళ్లిందట.   

PREV
16
ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్న స్నేహ..  అసలు రహస్యం బయటపెట్టిన క్రిటిక్‌

స్నేహ(Sneha).. టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్‌ తారల జోరు సాగుతున్న సమయంలోనే సాంప్రదాయానికి పెద్ద పీట వేస్తూ ఆకట్టుకుంది. నటనతో, అందంతో మెప్పించింది. చీరలోనూ అందం దాగుందని నిరూపించింది. సౌందర్య తర్వాత ఆ తరహాలో బలమైన పాత్రలు పోషించింది. సెలక్టీవ్‌గా సినిమాలు చేసి మెప్పించింది. 

26

గ్లామర్‌ హీరోయిన్లతో పోటీ పడి మరీ నటించింది. తనకంటూ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. స్టార్‌ హీరోలతోనూ కలిసి నటించిన స్నేహ.. తమిళ నటుడు ప్రసన్నని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. దీంతో సినిమాలకు దూరమైంది స్నేహ. ఈ మధ్య రీఎంట్రీ ఇస్తూ బలమైన పాత్రలు దక్కే సినిమాలు చేస్తుంది. హీరోలకు సిస్టర్ రోల్స్, వదిన పాత్రలు, ఇతర కీలక పాత్రలతో మెప్పిస్తుంది. 

36

ఇదిలా ఉంటే స్నేహకి ప్రసన్నతో ప్రేమ కంటే ముందు మరో పెద్ద లవ్‌ స్టోరీ ఉందట. ఆమె ఓ నిర్మాతని ప్రేమించిందట. చాలా రోజులు ప్రేమించుకున్నాక.. ఏకంగా పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. కానీ అంతలోనే క్యాన్సిల్‌ చేసుకుందట స్నేహ. తాజాగా ఈ విషయాన్ని ఫిల్మ్ క్రిటిక్‌ బైల్వాన్‌ రంగనాథ్‌ తెలిపారు. ఇన్నాళ్లు బయటకు రాని ఈ రహస్యాన్ని ఆయన బయటపెట్టారు.

46

ఆయన చెప్పిన దాని ప్రకారం.. స్నేహ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే ఓ నిర్మాతతో ప్రేమలో పడిందట. చాలా కాలం ఈ ఇద్దరి తమ రిలేషన్‌ షిప్‌ని కంటిన్యూ చేశారట. పెద్దల అంగీకారంతో ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారని, అయితే ఆ తర్వాత రవి చిత్త శుద్ది లేని మనిషి అని, నిజాయితీ పరుడు కాదని, భావించి స్నేహ అతన్ని దూరం పెట్టిందట. తనకు అతను సరైన వ్యక్తి కాదని భావించి స్నేహ ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్‌ చేసుకుందట.

56

అయితే అతనితో ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ చేసుకున్నాక మానసికంగా ఆమె చాలా కుంగిపోయిందట. చాలా రోజులు ఇబ్బంది పడిందని తెలిపారు. దీంతో చాలా రోజులు ఆమె ప్రేమ జోలికి వెళ్లలేదని, ప్రసన్న కుమార్‌ కూడా ఆమెని ప్రేమిస్తూ వెంటపడ్డా కూడా స్నేహ తన దగ్గరకి రానివ్వలేదట. ఏమాత్రం ఎంకరేజ్‌ చేయలేదని, గత ప్రేమ చేదు అనుభవాలు గుర్తొచ్చి ఆమె మగవాళ్లకి దూరంగా ఉండేదని ఆయన చెప్పారు. అయితే చాలా రోజులు ట్రావెల్‌ చేశాక, ప్రసన్న జర్నీని చాలా రోజులు చూసిన ఆమె అతనిపై నమ్మకంతో అతని ప్రేమని అంగీకరించిందని, అలా ప్రేమ పెళ్లి చేసుకున్నట్టు తెలిపారు. 

66

ఇన్నాళ్లు దాగిన స్నేహ సీక్రెట్‌ లవ్‌ స్టోరీ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారడంతోపాటు వైరల్‌ అవుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాలి. ఇక తరుణ్‌ హీరోగా నటించిన `ప్రియమైన నీకు` చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది స్నేహ. ఎంట్రీతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత గోపీచంద్‌తో `తొలివలపు`, జగపతిబాబుతో `హనుమాన్‌ జంక్షన్‌`, రవితేజతో `వెంకీ`, వెంకటేష్‌తో `సంక్రాంతి`, శ్రీకాంత్‌తో `రాధాగోపాలం`, `ఏవండోయ్‌ శ్రీవారు`, నాగార్జునతో `శ్రీరామదాసు`, `రాజన్న` బాలకృష్ణతో `మహారథి`, `పాండురంగడు`తోపాటు `మధుమాసం`, `ఆదివిష్ణు`, `అమరావతి` వంటి సినిమాలు చేసి మెప్పించింది స్నేహ.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories