మరో ప్రోమోలో `బిగ్ బాస్ లాగా` ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఇందులో హౌజ్‌మేట్స్ అంతా విభిన్నమైన గెటప్స్ లో రెడీ కావాల్సి ఉంటుంది. వారు ర్యాంప్ వాకులు చేస్తూ, ఇతర యాక్టివిటీస్ చేస్తూ ఎంటర్‌టైన్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో గెటప్లో తమకి నచ్చినట్టుగా విచిత్రంగా వినోదాన్ని పంచి విన్నర్ అవుతారో వారే ఈ వారం కంటెండర్‌గా నిలుస్తారని తెలిపారు బిగ్ బాస్. ఇందులో తేజ కూరగాయలన్నీ మీద వేసుకుని బట్టలు విప్పేసి ఆదివాసిలా మారిపోయాడు. ప్రియాంక దెయ్యం గెటప్‌లో కనిపించింది. రతిక ఉబకాయురాలిగా, అమర్ దీప్ సగం అమ్మాయి, సగం అబ్బాయిలా, యావర్ ముసలోడిగా, ప్రశాంత్ బిచ్చగాడిలా కనిపించి నవ్వులు పూయించారు.