స్నేహాను మోసం చేసిన ప్రసన్నా.. అమ్మాయితో ఎఫైర్.. స్వయంగా వెల్లడించిన హీరోయిన్..

First Published | Apr 18, 2024, 6:09 PM IST

సీనియర్ హీరోయిన్ స్నేహ తన భర్తపై సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తకు వేరే అమ్మాయితో లవ్ ఏఫైర్ ఉంది అంటూ బాంబ్ పేల్చింది. ఇంతకీ స్నేహ ఏమంటుందంటే..?

తెలుగు సినిమాకు దొరికిన మరో సావిత్రి, సౌందర్య గా హీరోయిన్ స్నేహను ప్రేక్షకులు ఆదరించారు. అశ్లీలం లేకుండా.. పద్దతిగా  నటిస్తూ.. హీరోయిన్ గా స్టార్ డమ్ చూసింది స్నేహ. యంగ్ స్టార్స్ దగ్గర నుంచి స్టార్ సీనియర్ హీరోల వరకూ అందరు హీరోలతో నటించి మెప్పించింది స్నేహ. చెన్నైలో సెటిల్ అయిన  అచ్చతెలుగు హీరోయిన్ స్నేహ. 

దాదాపు దశాబ్ధం పాటు తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో వెలుగు వెలిగిన స్నేహ.. ఆతరువాత నటుడు ప్రసన్న కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయిన ప్రస్నన్నను పెళ్ళాడి ఫ్యామిలీ లైఫ్ కే పరిమితం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. 

బాబోయ్.. ప్రభాస్ అన్నికేజీల బరువు తగ్గాడా..? షాకింగ్ లుక్ లో యంగ్ రెబల్ స్టార్...


 ప్రసన్నతో  2012లో ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా వీరిద్దరి గురించి ప్రస్తుతం ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. తన భర్త ప్రసన్న గురించి స్నేహ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతునర్నాయి. ప్రసన్న పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఓ విషయాన్ని స్నేహ వెల్లడించారు. 

మంచు విష్ణుకు షాక్ ఇచ్చిన నయనతార..? కన్నప్ప టీమ్ లో లుకలుకలు..?

sneha

గతంలో తన భర్త మరో అమ్మాయిని ప్రేమించాడని, కాని ఆతరువాత వారికి బ్రేకప్ అయ్యిందని ఆమె అన్నారు. తన భర్త గతం తాలూకు ప్రేమ వల్ల తనకు ఎలాంటి ఇబ్బందులు రాలేదున్నారు.

దీపికా పదుకొనే ఫస్ట్ క్రష్ ఆ హీరోనే..రూమ్ నిండా ఆ హీరోవి పెద్ద పెద్ద పోస్టర్లు ఉండేవట, ఎవరో తెలుసా..?

అంతే కాదు  వారు బ్రేకప్ చెప్పుకోకపోయి ఉంటే.. తనకు ప్రసన్న దక్కేవాడు కాదుగా అని స్నేహ వ్యాఖ్యనించినట్టు తెలుస్తోంది. వారు విడిపోయారు కాబట్టే..  ప్రసన్న తనకు భర్తగా దొరికాడంటూ మురిసిపోయారట స్నేహ.  

భార్యాభర్తలకు ఒకరికపై మరొకరికి నమ్మకం ఉండాలని... లేకపోతే కలిసి బతకడం కష్టమవుతుందని చెప్పారు. బయటకు ఎందుకు వెళ్తున్నావు, ఈ సమయంలో బయటకు ఎందుకు? వంటి ప్రశ్నలు తలెత్తకూడదని అన్నారు. మనల్ని అవతలి వ్యక్తి సరిగా అర్థం చేసుకుంటే ఇలాంటి ప్రశ్నలు రావని చెప్పారు. పొసెసివ్ నెస్ ఉండాలే కానీ... అది అతిగా ఉండకూడదని అన్నారు స్నేహ. 

ప్రస్తుతం స్నేహ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ అఫీషియల్ గా తెలియలేదు. ఇక గతంలో స్నేహ.. ప్రసన్న విడిపోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలను ఖండిస్తూ.. కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు స్నేహ. వాటితో ట్రోలర్స్ నోరు మూయించారు

అచ్చ తెలుగు హీరోయిన్ గా తన అందచందాలతో ప్రేక్షకులను మెప్పించిన స్నేహ అసలు పేరు సుహాసిని రాజారామ్ నాయుడు. ముంబైలో తెలుగు కుటుంబంలో జన్మించిన స్నేహ... దుబాయ్ లో పెరిగారు. అంత దుబాయ్ లో పెరిగినా..ఆమె మాత్రం అచ్చ తెలుగు ఆడపిల్లలా పద్దతిగా కనిపిస్తుంటారు. 

Latest Videos

click me!