అడివి శేష్ కేరీర్ ను మలుపుతిప్పింది మాత్రం 2016లో రిలీజ్ అయిన ‘క్షణం’. అప్పటి నుంచి వరుసగా హిట్ చిత్రాలనే అందుకుంటున్నారు. ‘క్షణం, అమీ తుమీ, గూఢాచారి, ఎవరు, మేజర్, హిట్ 2’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ ఆరు సినిమాలతో సక్సెస్ అందుకుని డబుల్ హ్యాట్రిక్ సాధించారు. ఇటీవల కాలంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాత ఆ ఘనత అడివి శేష్ కే దక్కింది.