అన్ స్టాపబుల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రభాస్ ని బాలయ్య (Balakrishna)హోస్ట్ చేయనున్నాడు. అనేక ఆసక్తికర విషయాలు వీరి మధ్య చర్చకు రానున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి, హీరోయిన్స్ తో ఎఫైర్ రూమర్స్ తెరపైకి రానున్నాయి. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య మొహమాటం లేకుండా ప్రశ్నలు అడుగుతాడు. గెస్ట్ లైఫ్ లో ఉన్న వివాదాలు, పుకార్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు.