Mahesh babu : మహేశ్ బాబుతో ఇంత మంది బాలీవుడ్ హీరోయిన్లు నటించారా? నెక్ట్స్ ఎవరో తెలుసా?

Published : Feb 04, 2024, 08:08 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh Babu ఇకపై  భారీ చిత్రాల్లో నటించబోతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్లు, ప్రముఖ నటీమణులు జోడిగా నటించనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే బాబు సరసన ఆరుగురు బాలీవుడ్ హీరోయిన్లు నటించడం విశేషం.

PREV
16
Mahesh babu : మహేశ్ బాబుతో ఇంత మంది బాలీవుడ్ హీరోయిన్లు నటించారా? నెక్ట్స్ ఎవరో తెలుసా?

మహేశ్ బాబు తొలిసారిగా నటించిన బాలీవుడ్ నటి నమ్రత శిరోద్కర్ Namrata Shirdkar కావడం విశేషం. వీరిద్దరు జంటగా నటించిన చిత్రం ‘వంశీ’. 2000లో విడుదలైంది.

26

ఆ తర్వాత ఏడాదే 2001లో సొనాలి బింద్రే Sonali Bendreతో కలిసి ‘మురారి’లో నటించారు. మహేశ్ బాబు కెరీర్ లో ఇదొక ఉత్తమమైన చిత్రం. క్రిష్ణ వంశీ డైరెక్ట్ చేశారు. 
 

36

‘నాని’ Nani చిత్రంతోనూ మహేశ్ బాబు బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ Ameesha Patelతో నటించారు. ఈ సైఫై చిత్రం 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

46

మహేశ్ బాబు కెరీర్లో బెస్ట్ లుక్ లో కనిపించిన చిత్రం ‘అతిథి’. ఈ చిత్రం2007లో విడుదలైంది. ఈ మూవీలోనూ బాలీవుడ్ నటి అమ్రిత రావు Amrita Rao మహేశ్ సరసన నటించింది. 

56

ఇక సుకుమార్ - మహేశ్ బాబు కాంబోలో వచ్చిన చిత్రం ‘వన్ నేనొక్కడినే’. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి క్రితి సనన్ Kriti Sanon నటించిన విషయం తెలిసిందే. 

66

చివరిగా బాలీవుడ్ హీరోయిన్ తో బాబు నటించిన చిత్రం ‘భరత్ అనే నేను’. ఈ  చిత్రంలో మహేశ్ బాబుకు జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ Kiara Advani నటించింది. ఇక నెక్ట్స్ SSBM29లో దీపికా పదుకొణె పేరు వినిపిస్తోంది. 
 

click me!

Recommended Stories