జివి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం జరుగుతుండగా, ఇటీవల చిత్ర బృందం చిత్రం పేరును ప్రకటించింది. 'పరాశక్తి' అని పేరు పెట్టగా, కొంతమంది శివాజీ అభిమానులు ఈ చిత్రం పేరును మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి అప్ డేట్ వచ్చింది. `పరాశక్తి` టీజర్ రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల అవుతుందని కొత్త పోస్టర్‌తో చిత్ర బృందం ప్రకటించింది.
ఆ పోస్టర్‌లో "నిప్పు రేపు సాయంత్రం 4 గంటల నుండి" అని రాసి ఉంది. శివకార్తికేయన్ ఒక యోధుడిలా చేతిలో బాటిల్ పట్టుకుని నిలబడి ఉండగా, ఆ బాటిల్‌లో నిప్పు మండుతోంది. ఈ పోస్టరే సినిమాపై అంచనాలను పెంచింది. యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా ఉండబోతుందని అర్థమవుతుంది.
read more: `తండేల్` ట్రైలర్‌లోనే కథ మొత్తం చెప్పేశారు.. ఇక భారమంతా సాయిపల్లవి, నాగచైతన్య మీదనే
also read: `పుష్ప` ఫ్లాప్, సుకుమార్‌కి ముందే చెప్పిన అల్లు అర్జున్, ఇంతటి సంచలనం వెనుక ఏం జరిగిందంటే?