విసిరికొట్టి బయటకి వెళ్లిపోయిన శివాజీ.. ఆడపిల్లవి అడ్వాంటేజ్ తీసుకోకు, శోభా శెట్టికి సీరియస్ వార్నింగ్ 

First Published | Dec 8, 2023, 1:38 PM IST

ఈ గేమ్ కి శోభా శెట్టి, యావర్ సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు. కోర్ట్ లోపల శివాజీ, ప్రియాంక, అర్జున్ గేమ్ ఆడుతున్నారు. శోభా శెట్టి ప్రియాంకని బాగా ఎంకరేజ్ చేస్తూ కనిపించింది.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో ప్రతి రోజూ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫైనల్ వీక్ సమీపించే కొద్దీ ఇంటి సభ్యుల మధ్య వివాదాలు ఎక్కువవుతున్నాయి. గురువారం ఎపిసోడ్ లో ప్రశాంత్, అమర్ దీప్ మధ్య రచ్చ ఏ స్థాయికి వెళ్లిందో చూశాం. అమర్ దీప్ ఒక సందర్భంలో కంట్రోల్ తప్పి బూతులు కూడా మాట్లాడాడు. 

అదే విధంగా యావర్, శోభా శెట్టి మధ్య కూడా మాటల యుద్ధం సాగింది. బిగ్ బాస్ ఇచ్చిన ఓట్ అప్పీల్ గేమ్ లో భాగంగా ఈ గొడవలు జరుగుతున్నాయి. నేడు కూడా బిగ్ బాస్ హౌస్ హాట్ హాట్ గా ఉండబోతోంది. బంతులు విసిరే గేమ్ నేడు శుక్రవారం ఎపిసోడ్ లో కూడా కొనసాగనుంది. 


శుక్రవారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ప్రోమో చూస్తుంటే శివాజీ, శోభా శెట్టి మధ్య రచ్చ తారా స్థాయికి చేరినట్లు అనిపిస్తోంది. ఈ గేమ్ కి శోభా శెట్టి, యావర్ సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు. కోర్ట్ లోపల శివాజీ, ప్రియాంక, అర్జున్ గేమ్ ఆడుతున్నారు. 

శోభా శెట్టి ప్రియాంకని బాగా ఎంకరేజ్ చేస్తూ కనిపించింది. ఆమె పదే ప్రియాంక కమాన్ అంటూ ఉండడం శివాజీకి నచ్చలేదు. దీనితో శివాజీ కోపంతో బంతులని విసిరికొట్టి బయటకి వెళ్ళిపోయాడు. ఏమైంది అని అని యావర్ ప్రశ్నించగా.. పదే పదే ఆ అమ్మాయి ప్రియాంక ప్రియాంక అంటుంటే మేమెందుకు ఆడడం.. నేను అవుట్ అంటూ శివాజీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

నా ఇష్టం నేను ఎవరికైనా సపోర్ట్ చేసుకుంటా.. మీకేంటి సమస్య అని శోభా శెట్టి ప్రశ్నించింది. ఏంటి సంచాలక్ గా ఉండి ఒకరికే సపోర్ట్ చేస్తావా అని శివాజీ ప్రశ్నించారు. నేను సంచాలక్ గా అయినా, శోభా శెట్టిగా అయినా నా ఇష్టం వచ్చిన వారికి సపోర్ట్ చేస్తా అని సమాధానం ఇచ్చింది. అందుకే నాకు నచ్చలేదు.. గేమ్ నుంచి బయటకి వచ్చేశా అని శివాజీ తెలిపాడు. 

ఇద్దరి మధ్య మాటల యుద్ధం చెలరేగడంతో శోభా ప్రొవోకింగ్ మొదలు పెట్టింది. సర్ సర్ కూర్చోండి, బాగా అలసిపోయారు అంటూ శోభా రెచ్చగొట్టింది. దీనితో శివాజీ ఆడపిల్లవి ఇలా అడ్వాంటేజ్ తీసుకోవద్దు అని వార్నింగ్ ఇచ్చాడు. మీలాగా అయితే నేను నటించలేను వామ్మో 80 కెమెరాల్లో మీరు నటిస్తారు అంటూ శోభా ప్రోవోక్ చేసింది. 

Latest Videos

click me!