‘ఆర్య’, ‘శంభో శివ భంభో’ చిత్రాలు శివబాలాజీలో మంచి ఫేమ్ ను తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ వస్తున్నారు. అలాగే Bigg Boss Telugu 1, నేతోనే డ్యాన్స్, రేస్ వంటి టీవీషోలతోనూ టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యారు. రీసెంట్ గా ‘శాకుంతలం’ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించారు.
తాజాగా తెలుగు సినీ పరిశ్రమలోని కొందరు నటీనటులను ఉద్దేశించి నెగెటివ్ ట్రోల్స్ చేస్తున్న యూట్యూబర్ విజయ్ చంద్రహాసన్‌పై (Vijay chandrahas) నటుడు, ‘మా’ కోశాధికారి శివ బాలాజీ (Siva balaji) హైదరాబాద్ సైబర్ క్రైమ్‌కు (Cyber crime) ఫిర్యాదు చేశారు.