విక్రమ్ ‘తంగలాన్’ OTT రిలీజ్ డేట్

సినిమాకు మొదటి రోజు ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. అయితే మెల్లిగా పికప్ అయ్యి వీకెండ్ కుమ్మేయటం నిర్మాతలను ఆనందంలో ముంచెత్తెంది. 

Chiyaan Vikram Thangalaan


ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రిలీజైన క్రేజీ చిత్రాల్లో ‘తంగలాన్’ ఒకటి. ఈ తమిళ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది.  విక్రమ్, దర్శకుడు పా రంజిత్ డైరెక్షన్ ల తెరకెక్కిన తాజా తమిళ్ చిత్రం ‘తంగలాన్’పై రిలీజ్ కు ముందు నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి.  

విక్రమ్ కెరీర్ లో 61 చిత్రంగా వచ్చిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో  మెల్లిగా టాక్ మొదలై పికప్ అయ్యింది.  అలాగే తంగలాన్ విడుదలైన తొలి రోజు నుంచే  తమిళనాడులో  మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. అయితే ఫస్ట్ వీకెండ్ తర్వాత సినిమా డ్రాప్ అయ్యింది. దాంతో సూపర్ హిట్ అనుకున్న సినిమా అనుకుంటే యావరేజ్ దగ్గర ఆగింది.  ఇప్పుడీ చిత్రం ఓటిటి రిలీజ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు.
 

Thangalaan Movie

  ఈ సినిమాలో విక్రమ్ లుక్ చూసి అందరూ షాక్ అయ్యారు. తంగలాన్ పాత్ర కోసం చేసిన  మేకోవర్ మతిపోగొట్టింది. అంతేకాకుండా ఏదో కొద్ది  సీన్స్ లో ఆ లుక్ కాకుండా సినిమా మొత్తం అదే లుక్ ఉండటంతో ...సుదీర్ఘ కాలం షూటింగ్‌లో అదే లుక్ లో  పాల్గొన్నారు. అది నిజంగా చాలా కష్టమై విషయం. సినిమాకు మొదటి రోజు ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. అయితే మెల్లిగా పికప్ అయ్యి వీకెండ్ కుమ్మేయటం నిర్మాతలను ఆనందంలో ముంచెత్తెంది. అయితే వీకెండ్ అనంతరమే నిలబడలేదు.


Chiyaan Vikrams Thangalaans


ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా  100 కోట్లు రాబట్టిందని స్టూడియో గ్రీన్ వారు పోస్టర్ వదిలారు. అయితే ఈ పోస్టర్ పై చాలా విమర్శలు వచ్చాయి. కావాలని హైప్ చేసి తంగలాన్ కలెక్షన్స్ చూపిస్తున్నారని సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. ఏదైమైనా ఈ సినిమా విడుదలకు ముందే మంచి హైప్ కూడా సాధించింది. మొదటి వారాంతంలో చాలా బాగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. 

తంగలాన్ చిత్రం ఓటిటి విషయానికి  సెప్టెంబర్ 20 నుండి తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో ప్రసారం కానుంది. నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా తంగలాన్ OTT హక్కులను తీసుకుంది. అయితే ఓటిటి రిలీజ్ డేట్ పై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్‌పై K. E. జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రంలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్, డేనియల్ కాల్టాగిరోన్, పశుపతి కీలక పాత్రలు పోషించారు.

Thangalaan


 కోలార్ బంగారు గనిలో తమిళుల విషాదకర సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సినిమాలో నటించిన అందరూ అద్భుతంగా చేశారు. అప్పటి పరిసస్థితులకు కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకుడు రంజిత్. అలాగే  జివి.ప్రకాష్ స్వరపరిచిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. . బ్రిటీష్ కాలం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. బంగారం కోసం చేసే అన్వేషణ ఈ సినిమాలో చక్కగా చూపించారు. మరోసారి చియాన్ విక్రమ్ తన నటనతో ఆకట్టుకుంటాడు. ఇలాంటి సినిమాలకు ఓటీటీలో ఇంకా మంచి ఆదరణ ఉంటుంది. 
 

Latest Videos

click me!