పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనె.. మోతెక్కిపోతున్న సోషల్ మీడియా

First Published | Sep 8, 2024, 2:38 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్ దంపతులు తల్లి తల్లి దండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. దీనితో బాలీవుడ్ తో పాటు, దేశం మొత్తం అభిమానులు ఎదురుచూశారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్ దంపతులు తల్లి తల్లి దండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. దీనితో బాలీవుడ్ తో పాటు, దేశం మొత్తం అభిమానులు ఎదురుచూశారు. ఆ తరుణం వచ్చేసింది. తాజాగా దీపికా పదుకొనె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 

ఆదివారం రోజు దీపికా తన బిడ్డకు జన్మనిచ్చింది. శనివారం రోజు దీపికా తన డెలివరీకి ముందుగా ఆసుత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. ముంబైలోని హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో రణ్వీర్ సింగ్ దీపికాని చేర్పించారు. 


దీపికా ఆడబిడ్డకు జన్మనివ్వడంతో కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. ప్రస్తుతం తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. దీపికా, రణ్వీర్ జంటకి ఆడబిడ్డ పుట్టడంతో సోషల్ మీడియా మోతెక్కిపోతోంది. అభిమానులు, సెలెబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

కొన్ని రోజుల క్రితమే దీపికా, రణ్వీర్ సింగ్ చేసిన మెటర్నిటీ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఏడాది దీపికా పదుకొనె.. ప్రభాస్ కల్కి చిత్రంతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సక్సెస్ అందుకుంది. ఈ చిత్రంలో దీపికా.. కల్కికి జన్మనిచ్చే గర్భవతిగా నటించింది. 

Latest Videos

click me!