యాక్టింగ్‌ రాదంటూ ఎగతాళి.. డిప్రెషన్‌లో సూసైడ్‌ చేసుకోవాలనుకున్న సీతారామం హీరోయిన్‌.. షాకింగ్‌ విషయాలు వెల్లడి

Published : Oct 04, 2022, 10:52 AM IST

`సీతారామం` చిత్రంతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా పాపులర్‌ అయిపోయింది మృణాల్‌ ఠాగూర్‌. ఓవర్‌  నైట్‌లో స్టార్‌ అయిపోయిన ఈ బ్యూటీ వెనకాల కన్నీళ్లు, కష్టాలున్నాయి. తాజాగా అవి బయటకొచ్చాయి.  ఓ ఇంటర్వ్యూలో తన గతాన్ని వెల్లడించింది మృణాల్‌. 

PREV
19
యాక్టింగ్‌ రాదంటూ ఎగతాళి.. డిప్రెషన్‌లో సూసైడ్‌ చేసుకోవాలనుకున్న సీతారామం హీరోయిన్‌.. షాకింగ్‌ విషయాలు వెల్లడి
Mrunal Thakur

మహారాష్ట్రలో పుట్టి పెరిగిన మృణాల్‌ మొదట డాక్టర్‌ కావాలనుకుందట. డెంటిస్ట్ అవ్వాలని ఎగ్జామ్‌ కూడా రాసింది. కానీ ఉన్నట్టుండి ఆమె ఆలోచన మారిపోయింది. మీడియా రంగంలోకి రావాలనే కోరిక కలిగిందట. దీంతో ఇంట్లో చెప్పడంతో అమ్మానాన్న ఒప్పుకోలేదు. బలవంతం మీద బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ మాస్‌ మీడియాలో చేరారు. ఈ విషయంలో చాలా అవమానాలు ఎదుర్కోవల్సి వచ్చింది. 
 

29
Mrunal Thakur

నాన్న బ్యాంక్‌ ఉద్యోగి. తన ఫ్యామిలీలో చాలా వరకు ఉద్యోగులే ఉన్నారు. వారికి ఈ కోర్స్ కూడా తెలియదు. ఎవరికి చెప్పినా అదో కోర్స్ ఉందా? అంటూ చులకనగా మాట్లాడేవారట. అవమానంగా చూసేవారని చెప్పింది మృణాల్‌. అది తనకు, పేరెంట్స్ చాలా ఇబ్బందిగా అనిపించేదని పేర్కొంది. నాన్నకి జాబ్‌ బదిలీ కావడంతో తను ముంబయిలోనే ఒంటరిగా ఉండాల్సి వచ్చింది.  
 

39
Mrunal Thakur

ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న అవమానాలు గుర్తొచ్చి వదిలేద్దామనుకుందట. ఆ ఆలోచనలు ఎక్కువై డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందట. నాన్నని బాధపెడుతున్నానని ఆలోచన ఎక్కువైంది. దీంతో లోకల్‌ ట్రైన్‌ లో కాలేజ్‌కి వెళ్తున్న నేపథ్యంలో ట్రైన్‌  నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుందట. కానీ ఫ్యామిలీ గుర్తొచ్చి, వాళ్లు ఎంత బాధపడతారో గుర్తు చేసుకుని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందట మృణాల్‌  ఠాగూర్‌. 

49
Mrunal Thakur

జర్నలిజం చేసేటప్పుడు కొందరు స్నేహితులు సినిమాల్లో ట్రై చేయాలని చెప్పడంతో ఆ దిశగా ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. మొదట మోడలింగ్‌ చేసింది. ఓ షోలో ఓ దర్శకుడు  చూసి `ముఝే కుఛ్‌ కెహ్తీ హై ఖామోషియా` అనే సీరియల్‌లో నటించే అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత `కుంకుమ భాగ్య`లో సీరియల్‌ నటించి మరింత పాపులర్‌ అయ్యింది. దీంతో సినిమాల వైపు మొగ్గుచూపింది. కానీ అక్కడ ఘోర అవమానాలు ఎదురయ్యాయి. 
 

59

ఓవైపు సీరియల్స్ చేస్తూ మధ్య మధ్యలో ఆడిషన్స్ కి వెళ్లేవారట. కానీ ఎవరూ అవకాశం ఇచ్చేవారు కాదని, సీరియల్స్ చేసుకునే నీకు సినిమాలెందుకు అంటూ  కామెంట్లు  చేసేవారట. హీరోయిన్‌గా పనికిరావు అని ముఖం మీదే చెప్పిన సందర్భాలున్నాయని, సీరియల్స్ వాళ్లు సినిమాలకు అవసరం లేదని, కొందరు మీకు యాక్టింగ్‌ రాదంటూ  అవమానించారని వాపోయింది మృణాల్‌. 

69

కానీ పట్టువిడవకుండా ప్రయత్నాలు చేస్తూ మొత్తానికి సినిమా అవకాశాలను దక్కించుకుంది. మొదట ఆమె హిందీలో సల్మాన్‌ తో `సుల్తాన్‌` చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. సినిమా కోసం మూడు నెలలు వర్కౌట్‌ చేసి,  మల్లయుద్ధంలో శిక్షణ కూడా తీసుకుందట. దాదాపు 11 కేజీల బరువు తగ్గింది. కానీ చివరి నిమిషంలో సినిమా నుంచి తీసేసి అనుష్క శర్మని తీసుకున్నారు. కానీ అది చేజారింది. ఆ తర్వాత `లవ్‌ సోనియా` చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్‌. 

79

ఇప్పుడు `సీతారామం`తెలుగులోకి ఎంట్రీ ఇండియా వైడ్‌గా పాపులర్‌ అయ్యింది. ఈ సినిమాతో అటు మలయాళంలో, ఇటు తెలుగు, హిందీలో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీని భారీ సినిమా అవకాశాలు వరిస్తున్నాయి.

 

89

ఎన్టీఆర్‌ కొరటాల చిత్రంలో ఈ అమ్మడినే తీసుకుంటున్నారట. ఆల్మోస్ట్ కన్ఫమ్‌ అనే  వార్త వినిపిస్తుంది.  దీనిపై క్లారిటీ  రావాల్సిందే.  అలాగే వైజయంతి మూవీస్‌లో ఓ సినిమా చేస్తుందని సమాచారం.

99

మరోవైపు హాట్‌ ఫోటో షూట్లతో నెటిజన్లకి షాకిస్తుంది  మృణాల్‌. అందాల విందులో హద్దులు చెరిపేస్తూ తాను సాంప్రదాయమైన పాత్రలే కాదు, గ్లామర్‌ రోల్స్ కూడా చేస్తాననే హింట్స్ ఇస్తుంది మృణాల్‌. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories