తండ్రి సినిమా పాటకి సితార దుమ్మురేపే డాన్సు.. ఆ స్టెప్పులకు శ్రీలీల కూడా దిగదుడుపే.. ఇక హీరోయిన్ అయితే రచ్చే

Published : Feb 03, 2024, 06:53 AM ISTUpdated : Feb 03, 2024, 08:15 AM IST

సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు కూతురు సితారలో మంచి డాన్సింగ్‌ కళ ఉంది. ఆమె తరచూ డాన్స్ వీడియోలు పెడుతుంది. తాజాగా ఆమె చేసిన డాన్స్ మాత్రం దుమ్మురేపేలా ఉంది.   

PREV
15
తండ్రి సినిమా పాటకి సితార దుమ్మురేపే డాన్సు.. ఆ స్టెప్పులకు శ్రీలీల కూడా దిగదుడుపే.. ఇక హీరోయిన్ అయితే రచ్చే

మహేష్‌ బాబు గారాల పట్టి సితార పాప.. సినిమాల్లో రాణించాలని కలలు కంటుంది. తను నటి కావాలని అనుకుంటున్నట్టు గతంలో చెప్పింది. చూడబోతుంటే ఆ దిశగానే ఆమె అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. మహేష్‌ బాబు నటించిన గత చిత్రం `సర్కారు వారి పాట`లో `పెన్నీ` సాంగ్‌లో మెరిసింది. ప్రమోషనల్‌ సాంగ్ లో డాన్స్ చేసి అదరగొట్టింది. 

25

అంతేకాదు తరచూ ఆమె తన సోషల్‌ మీడియా ద్వారా డాన్సు వీడియోలు షేర్‌ చేస్తుంది. చాలా కాలంగా ఆమె డాన్సులు చేస్తుంది. డాన్సు నేర్చుకుంటుంది. క్లాసికల్‌, వెస్ట్రన్ ఇలా అన్ని మిక్స్ చేసి కొడుతుంది. సోషల్‌ మీడియాలో దుమ్మురేపుతుంది. స్టార్‌ కిడ్‌గానే స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు సితారకే మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది. 
 

35

అందులో భాగంగా ఇప్పుడు అదిరిపోయే డాన్సు వీడియోని పంచుకుంది సితార. తన తండ్రి మహేష్‌ బాబు నటించిన `గుంటూరు కారం` సినిమాలోని `దమ్‌ మసాలా` పాటకి ఆమె దుమ్మురేపే డాన్సు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతుంది. ఇందులో సితార డాన్సుకి అంతా ఫిదా అవుతున్నారు. 
 

45

 `గుంటూరు కారం` సినిమాలో శ్రీలీల హీరోయిన్‌. ఆమె డాన్సులకు కేరాఫ్‌. అదరగొడుతుంది. అయితే తాజాగా సితార చేసిన డాన్సు శ్రీలీలని తలపిస్తుందని, ఇంకా చెప్పాలంటే శ్రీలీలని మించిపోతుందని, ఇప్పుడు ఇలా ఉంటే ఒకవేళ హీరోయిన్‌ అయితే డాన్సుల్లో శ్రీలీల కూడా దిగదుడుపే అంటున్నారు. ఇక సితారని బీట్‌ చేయడం కష్టమేఅంటున్నారు. 

55

`గుంటూరు కారం` ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో.. శ్రీలీలతో డాన్సులు అంటే హీరోలకు తాట ఊడిపోతుందన్నారు. ఇక సితార హీరోయిన్ అయితే సరిగ్గా ఆయన చెప్పిన డైలాగే ఆయన కూతురుకి కూడా వర్తిస్తుందని అంటున్నారు. మొత్తంగా సితార పాప ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. దుమ్మురేపే డాన్సుతో కేకపెట్టిస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories