గుంటూరు కారంకే జెలసీ పుట్టిస్తున్న పూజా హెగ్డే.. బాబోయ్ రెడ్‌ డ్రెస్‌లో ఇలా చూస్తే మంటలే

First Published | Feb 2, 2024, 9:43 PM IST

బుట్టబొమ్మ పూజా హెగ్డే సినిమాలు లేక డౌన్‌ అయిపోయింది. ఈ టైమ్‌లోనే తన అసలు అందాలకు పని చెబుతుంది. కొంత గ్యాప్‌ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు ఒక్కసారిగా మంటలు పుట్టిస్తుంది. 
 

పూజా హెగ్డే తాజాగా రెడ్‌ డ్రెస్‌లో ఫోటో షూట్‌ చేసింది. గుంటూరు మిర్చిని మించి ఘాటు రేపే అందాలతో రెచ్చిపోయింది. మంటలు పుట్టించే అందాలతో పోజులిచ్చింది. ఒక్కసారిగా సోషల్‌ మీడియా మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది.
 

పూజా హెగ్డే రెడ్‌ డ్రెస్‌ ధరించి లేటెస్ట్ ఫోటో షూట్‌ చేసింది. బ్యాక్‌ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. వీపు 70ఎంఎం తెర కనిపించేలా పోజులిచ్చింది. మరోవైపు జాకెట్‌ లేకుండా బ్రాకి ఎక్కువ, జాకెట్‌కి తక్కువ లాంటి టాప్‌ ధరించి రెచ్చిపోయింది. 
 


పూజా హెగ్డే ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. అందరి అటెన్షన్‌ గ్రాస్ప్ చేస్తున్నాయి. దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతూ గుంటూరు కారం ఫోటో షూట్‌ చేసిందా. మిర్చికి మంటలు పుట్టిస్తుందా అని అంటున్నారు. బుట్టబొమ్మని ఇంత హాట్‌గా చూసి ఉండరేమో అంటున్నారు. 
 

పూజా హెగ్డే.. గతేడాది బాలీవుడ్‌ సినిమాతో మెరిసింది. తెలుగులో ఆమె గతేడాది ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఆమె ఒప్పుకున్న ఆఫర్లన్నీ పోయాయి. ఒక్కసారిగా ఆమె డౌన్‌ అయిపోయింది. అంతకు ముందు లక్కీ హీరోయిన్‌గా, గోల్డెన్ లెగ్‌గా అనిపించుకుంది. కానీ వరుసగా ఐదు ఫ్లాప్‌లు పడటంతో సీన్‌ మొత్తం రివర్స్ అయ్యింది. 

ఇటీవల మహేష్‌ బాబుతో `గుంటూరు కారం` ఆఫర్‌ని మిస్‌ చేసుకుంది. దీంతోపాటు పవన్‌ కళ్యాణ్‌తో నటించాల్సిన `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` ఆఫర్‌ని మిస్‌ చేసుకుంది. దీంతోపాటు విజయ్‌ దేవరకొండతో రెండు సినిమా ఆఫర్లు మిస్‌ అయ్యాయి. 

ఇప్పుడు సాయిధరమ్‌ తేజ్‌తో `గంజా శంకర్‌` సినిమాకి కమిట్‌ అయ్యిందన్నారు. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు అది కూడా పోయిందట. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో ఒక్క ఆఫర్‌ కూడా లేదు. హిందీలో ఓ సినిమా చేస్తుంది. 

దీంతో అవకాశాల వేట స్టార్ట్ చేసింది పూజా హెగ్డే. మేకర్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకు అందాల విందు చేస్తుంది. డోస్‌ పెంచుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. సోషల్‌ మీడియా అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటుంది. 

Latest Videos

click me!