`చచ్చేంత ప్రేమ` నవల కాపీ వివాదంలో `శ్రీమంతుడు` నిర్మాతలు ఏం చేయబోతున్నారు? ఏం చెబుతున్నారు?

First Published Feb 2, 2024, 10:42 PM IST

`శ్రీమంతుడు` సినిమా స్టోరీ కాపీ వివాదం అనేక మలుపులు తీసుకుంటుంది. తాజాగా రైటర్‌ శరత్‌ చంద్ర కామెంట్లు, దానికి నిర్మాతలు రియాక్ట్ తీరు మరింత హీటెక్కిస్తుంది. 

మహేష్‌ బాబు నటించిన `శ్రీమంతుడు` మూవీ కాపీ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. ప్రస్తుతం ఇది కోర్ట్ లో ఉన్న నేపథ్యంలో ఇటు శరత్‌ చంద్ర, అటు సినిమా టీమ్‌ ఆచితూచి వ్యవహరిస్తుంది. అయితే ఇది తరచూ హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఆ మధ్య దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని, జైలుకి వెళ్లాల్సి వస్తుందని కోర్ట్ చెప్పింది. మరోవైపు `చచ్చేంత నవల` రచయిత శరత్‌ చంద్ర మాత్రం తాను మహేష్‌ బాబుపై కూడా కేసు వేస్తానని హెచ్చరిస్తున్నాడు. 

 ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన రకరకాల వార్తలు వైరల్‌ అవుతున్నాయి. దీనిపై `శ్రీమంతుడు` నిర్మాతలు స్పందించారు. `శ్రీమంతుడు` దర్శకుడు, నిర్మాతలపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో, అలాగే రైటర్‌ లేటెస్ట్ కామెంట్స్ నేపథ్యంలో నిర్మాతలు స్పందించారు. తప్పుడు వార్తలపై వాళ్లు మండిపడ్డారు. పలు హెచ్చరికలు చేశారు. 

Latest Videos


తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. `శ్రీమంతుడు` సినిమా, `చచ్చేంత ప్రేమ` నవల ఇప్పుడు పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్నాయి. ఈ రెండు వేటికవే భిన్నమైనవి. పుస్తకం, సినిమాని పరిశీలించే వారు ఈ వాస్తవాన్ని తక్షణమే ధృవీకరించవచ్చు. ఈ విషయం ప్రస్తుతం కోర్ట్ విచారణలో ఉంది. కానీ ఈ రోజు వరకు ఎలాంటి విచారణలు, తీర్పులు రాలేదు. అందువల్ల అప్పుడే ఎవరూ ఒక అభిప్రాయానికి రావొద్దని మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నాం. 
 

`శ్రీమంతుడు` సినిమా ముఖ్య ఉద్దేశ్యం అయిన గ్రామాన్ని దత్తత తీసుకోవాలనే మా ప్రధాన ఆలోచనపై మేం దృఢంగా నిలబడతాము. సినిమా స్టోరీపై రచయిత చేస్తున్న ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి. ఆ విషయంపై కోర్ట్ గానీ, రచయితల సంఘం గానీ ఎలాంటి తీర్పు ఇవ్వలేదనే వాస్తవం అందరు గ్రహించాలి. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై అసత్య ప్రచారాలు చేస్తున్న ఎవరిమీదనైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దయచేసి ఆధారం లేని ఆరోపణలను ప్రచారం చేయోద్దని మీడియాని కోరుతున్నాం` అని చెబుతూ నిర్మాతలు ఒక నోట్‌ని విడుదల చేశారు. 
 

అయితే `శ్రీమంతుడు` నిర్మాతలు తాజాగా హెచ్చరికలు రైటర్‌ని ఉద్దేశించే అని అర్థమవుతుంది. ఆయనే మహేష్‌ బాబు వ్యవహారాన్ని బయటపెట్టారు. తాను మహేష్‌ బాబు బ్యానర్‌పై కూడా కేసు వేయాలని భావించినట్టు చెప్పాడు. అయితే ఈ విషయం తెలిసి, జీఎంబీ బ్యానర్‌లో ప్రొడ్యూసర్‌ పేరుని మార్చేశారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాతల ప్రకటన ఆసక్తికంగా మారింది. ఈ వివాదం మరింత ముదురుతుందని తెలుస్తుంది. మరి దీనికి ముగింపు ఎప్పుడు అవుతుందో చూడాలి. 
 

click me!