Sitara-Balakrishna: సితార ఘట్టమనేని మిస్‌ చేసుకున్న బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా? మంచే జరిగింది

Published : Dec 16, 2025, 08:57 PM IST

ఒకప్పుడు బాలకృష్ణతో మహేష్‌ బాబు సిస్టర్‌ మంజుల నటించే అవకాశాన్ని కోల్పోయింది. అంతేకాదు మహేష్‌ బాబు కూతురు సితార కూడా బాలయ్యతో సినిమా చేసే అవకాశాన్ని కోల్పోయింది. 

PREV
15
సితార మిస్‌ చేసుకున్న బాలయ్య సినిమా

నందమూరి బాలకృష్ణ హీరోగా మహేష్‌ బాబు సోదరి మంజుల కాంబినేషన్‌లో ఓ సినిమా రావాల్సి ఉంది. ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. కానీ ఆ తర్వాత ఆగిపోయింది. అభిమానుల ఒత్తిడి మేరకు కృష్ణ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. మంజులని సినిమా నుంచి తప్పించారు. అలా బాలయ్య, మంజుల కాంబినేషన్‌లో సినిమా మిస్‌ అయ్యింది. అయితే ఇప్పుడు బాలయ్య, మహేష్‌ బాబు కూతురు కాంబినేషన్‌లో కూడా సినిమా మిస్‌ అయ్యింది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

25
అఖండ 2తో అలరిస్తోన్న బాలయ్య

బాలకృష్ణ ఇటీవల `అఖండ 2` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. శివతత్వం, సనాతన హైందవ ధర్మం గొప్పతనం చెప్పే ఉద్దేశ్యంతో తీసిన ఈ మూవీ ఆడియెన్స్ కి పెద్దగా కనెక్ట్ కావడం లేదు. దీంతో ప్రారంభం నుంచే డివైడ్‌ టాక్‌ వచ్చింది. కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయి. నాలుగు రోజుల్లో ఈ చిత్రం ఏకంగా రూ.72 కోట్లువసూలు చేసింది. అయితే టార్గెట్‌ చాలా పెద్దది. దాదాపు రెండువందల యాభై కోట్లకుపైగా వసూళ్లని రాబట్టాలి. ఈ లెక్కన ఈ మూవీ దాన్ని చేరుకోవడం కష్టమనే చెప్పాలి. లాంగ్‌ రన్‌ లో వంద కోట్లు వసూలు చేసే ఛాన్స్ ఉంది. కానీ ఈ మూవీ టార్గెట్‌ చేరుకోవడం కష్టమనే చెప్పాలి.

35
సైంటిస్ట్ గా నటించిన హర్షాలి

`అఖండ 2 తాండవం`లో హీరోయిన్‌ సంయుక్త కీలక పాత్ర పోషించింది. ఆది పినిశెట్టి విలన్‌గా నటించాడు. పూర్ణ, హర్షాలి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఇందులో బాలయ్య కూతురుగా హర్షాలి నటించింది. ఆమె సల్మాన్‌ ఖాన్‌ హీరోగా వచ్చిన `భజరంగీ భాయిజాన్‌` చిత్రంలో బాలనటిగా హర్షాలీ నటించింది. ఆమె ఇప్పుడు `అఖండ 2 తాండవం`లో బాలయ్య కూతురిగా, యంగ్‌ సైంటిస్ట్ గా నటించింది. అత్యధికంగా ఐక్యూ ఉన్న అమ్మాయిగా, యంగ్‌ సైంటిస్ట్ జననిగా హర్షాలి రికార్డు సృష్టిస్తుంది. సైంటిస్ట్ గా కీలక పాత్రలో కాసేపు మెరిసింది హర్షాలి.

45
జనని పాత్రని మిస్‌ చేసుకున్న సితార

అయితే ముందుగా ఈ పాత్ర కోసం మహేష్‌ బాబు కూతురు, లిటిల్‌ ప్రిన్సెస్‌ సితారని అనుకున్నారట. కానీ ఏం జరిగిందో ఏమో ఆ తర్వాత వద్దనుకున్నారు. మహేష్‌ ఫ్యామిలీ నుంచి రిజెక్షన్‌ వచ్చిందా? లేక బాలయ్య వద్దు అనుకున్నారా? కారణం తెలియదుగానీ, ఈ మూవీలో బాలయ్య కూతురుగా జనని పాత్రలో నటించే అవకాశాన్ని సితార కోల్పోయింది. ఒకవేళ నిజంగానే సితార ఇందులో నటించి ఉంటే ఈ మూవీకి మంచి క్రేజ్‌ వచ్చేది, మహేష్‌బాబు అభిమానులు దీన్ని ఎంకరేజ్‌ చేసేవారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొత్తంగా అప్పుడు మంజుల, ఇప్పుడు సితార బాలయ్య సినిమాలో నటించే ఛాన్స్ ని కోల్పోయారు. అయితే సితార మిస్‌ అవ్వడం వల్ల మంచే జరిగిందంటున్నారు మహేష్‌ అభిమానులు. ఎందుకంటే హర్షాలి పాత్ర విషయంలో విమర్శలు వచ్చాయి. ట్రోల్స్ వచ్చాయి.  ఐక్యూ విషయంలో 250కిపైగా ఉందని చెప్పడం నమ్మేలా లేదని అంటున్నారు.  

55
హీరోయిన్‌ కావాలనే కోరికతో సితార

సితార ఘట్టమనేని ప్రస్తుతం స్టడీస్‌లో బిజీగా ఉంది. ఆ మధ్య ఓ దుస్తుల యాడ్‌లోనూ నటించిన విషయం తెలిసిందే. యూఎస్‌లో టైమ్‌ స్వ్కేర్‌పై సితార నటించిన యాడ్‌ ని ప్రదర్శించారు. దీనిపై ప్రదర్శించబడ్డ అతిచిన్న సెలబ్రిటీ సితార కావడం విశేషం. అయితే సితారకి సినిమాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ ఉంది. హీరోయిన్‌ కావాలనుకుంటున్నట్టు గతంలో వెల్లడించింది. మరి మహేష్‌బాబు ఆమెని ఎంకరేజ్‌ చేస్తాడా? లేదా అనేది అసలు ప్రశ్న.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories