Pawan Kalyan Gift: `ఓజీ` దర్శకుడికి పవన్‌ కళ్యాణ్‌ ఊహించని గిఫ్ట్.. సుజీత్‌ ఎమోషనల్‌

Published : Dec 16, 2025, 06:57 PM IST

ఈ ఏడాది `ఓజీ` మూవీతో బిగ్గెస్ట్ హిట్‌ని అందుకున్నాడు పవన్‌ కళ్యాణ్‌. తనకు ఇంతటి విజయాన్ని అందించిన దర్శకుడు సుజీత్‌కి ఊహించని గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌ చేశారు పవన్‌ కళ్యాణ్‌. 

PREV
15
`ఓజీ`తో కెరీర్‌ బెస్ట్ హిట్‌ అందుకున్న పవన్‌ కళ్యాణ్‌

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కి చాలా రోజుల తర్వాత అదిరిపోయే హిట్‌ పడింది. ఆయన ఇటీవల `ఓజీ` చిత్రంతో మెప్పించిన విషయం తెలిసిందే. సుజీత్‌ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. డీవీవీ దానయ్య నిర్మించారు. ఇందులో ఇమ్రాన్‌ హష్మి విలన్‌గా నటించగా, ప్రకాష్‌ రాజ్‌, అర్జున్‌ దాస్‌ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటించింది. సెప్టెంబర్‌ 25న విడుదలైన ఈ మూవీ ఈ ఏడాది బిగెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

25
అభిమానులకు ఫుల్‌ మీల్స్ పెట్టిన పవన్‌

పవన్‌ కళ్యాణ్‌ ఇందులో గ్యాంగ్‌ స్టార్‌గా నటించాడు. ముంబాయి గ్యాంగ్‌ స్టర్‌గా ఆయన అదరగొట్టాడు. ఇందులో యాక్షన్‌ సీక్వెన్స్ హైలైట్‌గా నిలిచాయి. ఎలివేషన్లు సినిమాని నిలబెట్టాయి. పవన్‌ మార్క్ స్టయిల్‌, స్వాగ్‌, యాక్షన్లు, మరోవైపు థమన్‌ సంగీతం, బిజీఎం సినిమాకి బ్యాక్‌ బోన్‌గా నిలిపాయి. మూవీని అభిమానులకు పూనకాలు తెప్పించాయి. దీంతో చాలా కాలంగా హిట్‌ కోసం చూస్తున్న అభిమానులకు ఫుల్‌ మీల్స్ పెట్టినట్టయ్యింది. వాళ్లు బ్రహ్మరథం పట్టారు. సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. ఏకంగా మూడు వందల కోట్లు సాధించింది.

35
సుజీత్‌కి అదిరిపోయే గిఫ్ట్

ఈ ఏడాది తెలుగులో అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా `ఓజీ` నిలవడం విశేషం. అయితే చిత్ర దర్శకుడు సుజీత్‌ తనకు ఇలాంటి లైఫ్‌ టైమ్‌ హిట్‌ ఇచ్చిన నేపథ్యంలో ఆయన్ని ఊహించని గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌ చేశాడు పవన్‌ కళ్యాణ్‌. సుజీత్‌కి కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. లాండ్‌ రోవర్‌ కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. ల్యాండ్‌ రోవర్‌ కంపెనీకి చెందిన డిఫెండర్‌ అనే మోడల్‌ కారుని బాహుమతిగా ఇవ్వడం విశేషం. బ్లాక్‌ కలర్‌ కార్‌ చాలా స్టయిలీష్‌ గా ఉంది. దీని విలువ ఏకంగా రూ.కోటి వరకు ఉంటుంది.

45
సుజీత్‌ ఎమోషనల్‌ పోస్ట్

పవన్‌ కళ్యాణ్‌ తనకు కార్‌ గిఫ్ట్ గా ఇచ్చిన నేపథ్యంలో దర్శకుడు సుజీత్‌ స్పందించారు. ట్విట్టర్‌ ద్వారా ఆయా ఫోటోలను పంచుకుంటూ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టాడు. `అత్యుత్తమ బహుమతి మాటల్లో చెప్పలేనంతగా ఆనందంతో ఒప్పొంగిన  కృతజ్ఞతతో నిండినది. నా ప్రియమైన ఓజీ, కళ్యాణ్‌ గారి నుంచి వచ్చిన ప్రేమ, ప్రోత్సాహమే నాకు అన్నీ. చిన్ననాటి అభిమానిగా ఉండటం నుంచి ప్రత్యేక క్షణం వరకు ఎప్పటికీ రుణపడి ఉంటాను` అని తెలిపారు సుజీత్‌.

55
ఉస్తాద్‌ తో రాబోతున్న పవన్‌

పవన్‌ కళ్యాణ్‌ ఈ ఏడాది `హరి హర వీరమల్లు`, `ఓజీ` చిత్రాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. అలరించారు. `ఓజీ`తో కెరీర్‌ బెస్ట్ హిట్‌ అందుకున్నారు. ఇప్పుడు ఆయన `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఆల్మోస్ట్ పూర్తయ్యింది. ఇటీవల `దేఖ్‌ లేంగే సాలా` పాటని విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి విశేష స్పందన లభించింది. హరీష్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీలా, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories