9 సినిమాలు చేస్తే.. అందులో 8 ఫ్లాప్‌లు.. పాన్ ఇండియా స్టార్‌పైనే ఆశలన్నీ.. ఎవరీ హీరోయిన్.?

Published : Dec 16, 2025, 06:53 PM IST

Nidhi Agarwal: సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం.. అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. మరి అదృష్టం లేని భామలు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఆ కోవకు చెందిన హీరోయిన్ ఈమె. మరి అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. 

PREV
15
అదృష్టం కలిసిరాలేదు..

సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. టాలెంట్ ఎంత ఉన్నా.. అదృష్టం లేకపోతే.. ఇండస్ట్రీలో ఆఫర్లు దక్కడం కష్టమే. హీరోలకు హీరోయిన్లకు కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. ఒక్కసారి ఫ్లాప్‌లు ఎదురై.. ఐరెన్ లెగ్ ముద్ర పడిందంటే చాలు.. మళ్లీ ఆ ట్యాగ్ లైన్ పోవాలంటే చాలా కష్టం. సరిగ్గా ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కుంటోంది ఆ హీరోయిన్.

25
ఫ్లాప్ హీరోయిన్‌గా ముద్ర..

ఈ హీరోయిన్ ఏ సినిమా చేసినా.. ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అవుతోంది అన్నట్టు ఉంది పరిస్థితి. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు నిధి అగర్వాల్. ఈ హీరోయిన్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. మోడలింగ్ ద్వారా తన కెరీర్ ప్రారంభించి.. ఆపై ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 'మున్నా మైఖేల్' సినిమాతో అరంగేట్రం చేసిన ఈ భామ.. బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళ చిత్రాలలో తనదైన ముద్ర వేసింది.

35
సవ్యసాచితో తెలుగులోకి..

'సవ్యసాచి' సినిమాతో తెలుగులోకి పరిచయమైంది నిధి అగర్వాల్. అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. 'మిస్టర్ మజ్ను', 'ఇస్మార్ట్ శంకర్' లాంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పటివరకు అమ్మడి కెరీర్‌లో ఒక్క హిట్ లేదు. స్టార్ హీరోలతో నటించినా కూడా ఈమె జాతకం ఏం మారలేదు.

45
ఒక్క హిట్ మాత్రమే..

నిధి అగర్వాల్ కెరీర్‌లో 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఒకటే బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ సాధించింది. అందులో నిడివి ఉన్న పాత్రలో నటించడమే కాదు.. గ్లామరస్ లుక్‌లో కనిపించి యువతను ఆకట్టుకుంది. అది హిట్ అయినప్పటికీ ఆమెకు అనుకున్నంత స్థాయిలో ఆఫర్లు మాత్రం దక్కలేదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా చేసినా సక్సెస్ అందించలేకపోయింది.

55
ఆశలన్నీ ఆ సినిమాపైనే..

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'హరిహర వీరమల్లు' బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. ఇక ప్రస్తుతం నిధి అగర్వాల్ ఆశలన్నీ 'రాజాసాబ్' సినిమాపైనే. దర్శకుడు మారుతి, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాతోనైనా నిధి హిట్ కొడుతుందేమో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories