Sirivennela death: త్రివిక్రమ్ పెళ్లి చేసిన సిరివెన్నెల.. వరుసకు ఏమవుతారంటే

First Published Nov 30, 2021, 5:40 PM IST

పాటల దిగ్గజం సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry Dead) (66)కన్నుమూశారు. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. 

పాటల దిగ్గజం సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry Dead) (66)కన్నుమూశారు. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. కొన్ని రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల ఈ నెల 24నే ఆసుపత్రిలో చేరారు. మూడు రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే మంగళవారం సిరివెన్నెల ఆరోగ్యం మరింత విషమించడంతో సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సిరివెన్నెల అత్యంత ఇష్టమైన రచయిత. త్రివిక్రమ్, సిరివెన్నెల మధ్య రియల్ లైఫ్ బాండింగ్ కూడా ఉంది. సిరివెన్నెల సోదరుడి కుమార్తె సౌజన్యని త్రివిక్రమ్ వివాహం చేసుకున్నారు. పెళ్లి చూపులు అరేంజ్ చేసింది సిరివెన్నెలే. కాకపోతే అందులో ట్విస్ట్ ఉంది. 

పెళ్లి చూపులకు వెళ్లిన త్రివిక్రమ్ ఆమె సోదరి సౌజన్యని ఇష్టపడ్డారు. ఈ విషయాన్ని త్రివిక్రమ్ సిరివెన్నెల చెప్పగా మొదట ఆయన కాస్త ఆలోచించారు. కానీ చివరకు త్రివిక్రమ్ కోరికని మన్నించి సౌజన్యతో వివాహం జరిపించారు. త్రివిక్రమ్ పై సిరివెన్నెల ప్రభావం ఎంతైనా ఉంది. తన పాటల్లో పదాలు పదునుగా ఆలోచింపజేసే విధంగా, వైవిధ్యంగా ఉండాలని భావించే రచయిత సిరివెన్నెల. 

త్రివిక్రమ్ కూడా అంతే.. మూస ధోరణికి స్వస్తి చెబుతూ పదునైన డైలాగులతో రచయితగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత దర్శకుడిగా తనని తాను నిరూపించుకుని టాలీవుడ్ అగ్ర దర్శకుల జాబితాలో చేరారు. ఒక ఈవెంట్ లో త్రివిక్రమ్ సిరివెన్నెల గురించి చేసిన ప్రసంగం ఎప్పటికి మరచిపోలేము. 'ఆయన అర్థరాత్రి ఉదయించే సూర్యుడు' అంటూ త్రివిక్రమ్ ఆవేశభరితంగా సిరివెన్నెల గొప్పతనం వర్ణిస్తూ ప్రసంగించారు. 

'బలపం పట్టి భామ ఒళ్ళో' లాంటి మాస్ సాంగ్ లో కూడా సిరివెన్నెల స్పేస్ క్రియేట్ చేసుకుని అద్భుతమైన పదాలు ఉపయోగించారు అంటూ త్రివిక్రమ్ ప్రశంసలు కురిపించారు. ఆయన తెలుగు కవిగా పుట్టడం మనందరి అదృష్టం అని త్రివిక్రమ్ అన్నారు. సిరివెన్నెల కెరీర్ లో ఆయన రాసిన పాటలు గమనిస్తే అది అక్షర సత్యం అనిపిస్తుంది. 

కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో సిరివెన్నెలని ప్రశ్నించారు. ‘త్రివిక్రమ్ గారు మిమ్మల్ని రాత్రి ఉదయించే సూర్యుడు అని సంబోధించడానికి కారణం ఏంటి గురువు గారూ…?’ అని ప్రశ్నించారు. వెంటనే సిరివెన్నెల ‘మనకు ఇష్టమైన విషయాన్ని, మనకు తోచిన విధంగా వ్యక్తీకరిస్తాం. నేను సాధారణంగా రాత్రిపూట పనిచేస్తాను కాబట్టి దానిని ఆయన భాషలో ఆయన వ్యక్తీకరించారు’ అంటూ చెప్పుకొచ్చారు. తనకు బాగా నచ్చే పుస్తకం.. ఒకటి- భగవద్గీత, రెండు- ఖలీల్ జిబ్రాన్ రాసిన ‘ద ప్రాఫిట్’ అని చెప్పారు. తనకు బాగా నచ్చే కవి ‘వాల్మీకి’ అని తెలిపారు. ఇన్నేళ్ల తన సాహిత్య ప్రయాణంలో ప్రయోగించిన, గర్వించదగ్గ పదం లేదా వాక్యంపై స్పందిస్తూ.. ”ప్రశ్న – కొడవలిలా ఉండి కుత్తుక కోస్తూ వెంటపడే ప్రశ్న” అంటూ చెప్పుకొచ్చారు.Also Read: ఆ సినిమాల కోసం నయా పైసా తీసుకోకుండా పాటలు రాసిన సిరివెన్నెల... సీతారామశాస్త్రి పాటల ప్రస్తానంలో...

click me!