Unstoppable With NBK: చిరంజీవి పెళ్లిపై మోహన్ బాబు కామెంట్స్ వైరల్.. కాబట్టే బాగున్నాడు అంటూ..

First Published | Nov 4, 2021, 6:43 PM IST

సినీ కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో అల్లుడుగారు, పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ చిత్రాలతో నిలదొక్కుకున్నానని మోహన్ బాబు అన్నారు. 

అల్లు అరవింద్ 'ఆహా' ఓటిటి క్రమంగా పాపులర్ అవుతోంది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లు, ఒరిజనల్ మూవీస్ తో ఆహా ఓటిటి అందరిని ఆకర్షిస్తోంది. ఆహా ఓటిటిలో నందమూరి బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' అనే షో చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ఈ షోపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. 

ఇక ఈ షో తొలి ఎపిసోడ్ కి గెస్ట్ గా Mohan Babu ని రంగంలోకి దించారు. Balakrishna హోస్ట్.. మోహన్ బాబు గెస్ట్ కావడంతో అన్ స్టాపబుల్ పై ఉత్కంఠ మరింతగా ఎక్కువైంది. దీపావళి కానుకగా తొలి ఎపిసోడ్ గురువారం విడుదలయింది. మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, మంచు లక్ష్మి కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఆసక్తికరంగా సాగిన ఈ ఎపిసోడ్ లో బాలయ్య, మోహన్ బాబు మధ్య అనేక విషయాలు చర్చకు వచ్చాయి. 


మోహబ్ బాబు మొదటగా తన సినీ కెరీర్ లో పడ్డ ఇబ్బందులు, స్వర్గీయ NTR తో తన అనుబంధం గురించి వివరించారు. సినిమా కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. సొంత బ్యానర్ లో నిర్మించిన చాలా చిత్రాలు నిరాశపరిచాయి. నష్టాన్ని మిగిల్చాయి. దీనితో నా భూములు అమ్మి డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ఎమోషనల్ అయ్యారు. 

ఒకరోజు ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి 'అన్నయ్య మీతో సినిమా చేయాలనుకుంటున్నాను' అని చెప్పాను. రాజకీయాల్లో విఫలమైన నన్ను సినిమాల్లో ఇంకేం చూస్తారు. అనవసరంగా డబ్బులు వృధా చేసుకోకు అని అన్నారు. ఆ మాటలతో ఎన్టీఆర్ మరోసారి తన గొప్పతనం చాటుకున్నారు అని మోహన్ బాబు అన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్, మోహన్ బాబు కాంబినేషన్ లో 1993లో మేజర్ చంద్రకాంత్ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. 

సినీ కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో అల్లుడుగారు, పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ చిత్రాలతో నిలదొక్కుకున్నానని మోహన్ బాబు అన్నారు. ఇక బాలయ్య చిరంజీవిపై మీ అభిప్రాయం ఏంటి అంటూ ఆసక్తికర ప్రశ్న సంధించారు. దీనికి బాలయ్య కూడా ఆసక్తికరంగానే సమాధానం ఇచ్చాడు. 

వ్యక్తిగతంగా Chiranjeeviపై నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. చిరంజీవి మంచి నటుడు.. అద్భుతమైన డాన్సర్. మేమిద్దరం కలసి ఎన్నో చిత్రాల్లో నటించాం. అల్లు రామలింగయ్య గారి అమ్మాయి సురేఖని చిరంజీవి పెళ్లి చేసుకున్నాడు. సురేఖ నాకు సోదరి లాంటిది. అంటే మన ఇంటి అమ్మాయిని చిరంజీవి పెళ్లి చేసుకున్నాడు. కాబట్టే అతను బాగున్నాడు అంటూ మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, మోహన్ బాబు మధ్య వివాదాలు ఉన్నాయనే అంశంపై అభిమానుల్లో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. 

Also Read: Eesha Rebba: దీపావళి వెలుగంతా ఆమె అందంలోనే.. అదిరే సోయగాలతో ఈషా రెబ్బా పండుగ ట్రీట్

Latest Videos

click me!