తొలి కెప్టెన్ గా సిరి.. వద్దే నీ పుట్టలో వేలు పెట్టను అంటూ పచ్చిగా సరయు..

pratap reddy   | Asianet News
Published : Sep 09, 2021, 11:28 PM IST

ఎప్పటిలాగే లోబో సందడితో బిగ్ బాస్ నేటి ఎపిసోడ్ ప్రారంభమైంది. షణ్ముఖ్ కి సేవకుడిగా ఉన్న లోబో చిరాకు పడుతూ కనిపిస్తాడు. ఉదయం లేవగానే హమీద మొదట పవర్ యాక్సెస్ అందుకుంటుంది. దీనితో ఆమెకు పవర్ వస్తుంది. 

PREV
17
తొలి కెప్టెన్ గా సిరి.. వద్దే నీ పుట్టలో వేలు పెట్టను అంటూ పచ్చిగా సరయు..

ఎప్పటిలాగే లోబో సందడితో బిగ్ బాస్ నేటి ఎపిసోడ్ ప్రారంభమైంది. షణ్ముఖ్ కి సేవకుడిగా ఉన్న లోబో చిరాకు పడుతూ కనిపిస్తాడు. ఉదయం లేవగానే హమీద మొదట పవర్ యాక్సెస్ అందుకుంటుంది. దీనితో ఆమెకు పవర్ వస్తుంది. 

27

హమీదకు వచ్చిన పవర్ ప్రకారం ఆమె ఎంచుకున్న ఓ ఇంటి సభ్యుడు ఈ సీజన్ మొత్తం కెప్టెన్ అయ్యే అవకాశం కోల్పోతాడు. దీనితో హమీద.. ప్రియాని ఎంచుకుంటుంది. కానీ ప్రియా మాత్రం బాధకు గురికాకుండా స్పోర్టివ్ గానే తీసుకుంటుంది. 

37

ఇక తొలి కెప్టెన్సీ టాస్క్ కోసం సిరి, హమీద, విశ్వ, మానస్ అర్హత సాధిస్తారు. బిగ్ బాస్ ఈ నలుగురికి సైకిల్ తొక్కే టాస్క్ 'తొక్కరా తొక్కు హైలెస్సా' ఇస్తారు. ఈ టాస్క్ ప్రకారం గార్డెన్ ఏరియాలో ఉన్న నాలుగు సైకిల్స్ పై ఒక్కొక్కరు ఎక్కాలి. ఆ సైకిల్స్ కి ఉండే బల్బులు ఆగకుండా తొక్కుతూనే ఉండాలి. 

47

చివరి వరకు ఎవరు బల్బు ఆగకుండా తొక్కుతూ ఉంటారో వారే విజేత. ఈ టాస్క్ కి సంచలకురాలిగా ఇంటి సభ్యులు ప్రియాని ఎంచుకుంటారు. మిగిలిన సభ్యులు వారికి నచ్చిన వారికి సపోర్ట్ చేయవచ్చు. నచ్చనివారిని డిస్ట్రబ్ చేయవచ్చు. 

57

ఈ టాస్క్ లో విశ్వ ఎక్కువగా టార్గెట్ అవుతాడు. ఆర్జే కాజల్ ఎక్కువగా విశ్వనే టార్గెట్ చేయడం సరయుకి నచ్చదు. దీనితో సరయు, కాజల్ మధ్య రచ్చ మొదలవుతుంది. మొదట విశ్వనే టాస్క్ నుంచి బయటకు వెళతాడు. టాస్క్ లో చివరి వరకు ఉన్న సిరి విజేతగా నిలుస్తుంది. దీనితో హౌస్ కి ఆమె తొలి కెప్టెన్ గా బిగ్ బాస్ ప్రకటిస్తారు. 

67

మరోవైపు సరయు, కాజల్ మధ్య గొడవని కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేస్తుంది ప్రియా. కాజల్ గేమ్ ప్రకారం ఎవరినైనా డిస్ట్రబ్ చేయవచ్చు అని ప్రియా అంటుంది. గేమ్ కాదు మాటే ముఖ్యం అని సరయు అంటుంది. కాజల్ సరయుతో మాట్లాడే ప్రయత్నం చేయగా.. వద్దే నేను నీ పుట్టలో వేలు పెట్టను అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ కొడుతుంది సరయు. 

77

ఇక చివర్లో ఎప్పటిలాగే నటి ఉమాదేవి వాగ్వాదం చేస్తుంది. కిచెన్ లో అంట్లు తోమే విషయంలో ఉమాదేవి.. లహరి, ప్రియాంకతో గొడవేసుకుంటుంది. అలా నేటి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

click me!

Recommended Stories