గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ సునీత, శుభాకాంక్షలు చెపుతున్న నెటిజన్లు

First Published | Aug 29, 2022, 1:43 PM IST

తన సోషల్ మీడియా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.. టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత. ఆమె చెప్పిన న్యూస్ వినడంతోనే కాంగ్రాట్స్ చెపుతూ.. వరుసగా కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ సునీత ఏం చెప్పింది...? 
 

ఒక్క సింగ‌ర్‌గానే కాకుండా.. డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా, నటిగా, యాంకర్ గా, జడ్జిగా..  లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉండే.. సునీత సోషల్‌ మీడియాలో కూడా ఫుల్  యాక్టివ్‌గా ఉంటారు. నెటింట్లో.. సునితకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవ్వాల్సిందే. 
 

టాలీవుడ్‌ లో  స్టార్‌ సింగర్‌ గా  తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సాధించింది సునీత. ఆమె  గురించి.. ఆమె గాత్రం గురించి  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే సునిత.. ఇండస్ట్రీలో అనేక పాత్రలు పోషిస్తోంది. 


ఇక తాజాగా సునిత సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. తన  అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు స్టార్ సింగర్.  ఇన్‌స్టాగ్రామ్‌లో వన్‌ మినిట్‌ మ్యూజిక్‌ వీడియోలను రిలీజ్‌ చేస్తున్నట్లు  ప్రకటించారు. ఈరోజు (29 సోమవారం) నుంచే తన మొదటి మ్యూజిక్‌ రీల్స్‌ను అప్‌లోడ్‌ చేస్తానని చెప్పారు. 

ఇక ఈ వీడియోపై వరుసగా స్పందిస్తున్నారు నెటిజన్లు.. సునిత ఫ్యాన్స్ వరుసగా కామెంట్లు పెడుతున్నారు.  మీ గొంతు వినడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాం అంటూ ఆన్సర్ చేస్తున్నారు. ఇక సునిత స్టార్ట్ చేస్తున్న ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయంటూ.. తెలిపింది.   
 

15 ఏళ్లకే ఫిల్మ్ ఇండస్ట్రీకి సింగర్ గా ఎంట్రీ ఇచ్చింది సునీత.   గులాబి, ఎగిరే పావురమా లాంటి సినిమాల్లో ఆమె పాడిన పాటకు అంతా ఫిదా అయ్యారు. అప్పటి నుంచి నిర్విరామంగా పాటలు పాడుతూ వస్తోంది  సునితా. ఇప్పటి వరకూ దాదాపుగా 3000లకు పైగా పాటలు పాడారు సునిత. 

మల్టీ టాలెంట్ అని నిరూపించకుంది సునీత.  ఇప్పటి వరకు దాదాపుగా 500 సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పింది. అంతే కాదు యాంకర్ గా సెలబ్రెటీ సింగర్స్ ను సక్సెస్ ఫుల్ గా ఇంటర్వ్యూ చేసింది సునీత. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ, హఇందీ భాషల్లో పాటులు పాదింది సునీత. 

19 సంవత్సరాల వయసులో సునీతకు పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఆకాష్, శ్రేయ పుట్టిన తరువాత చాలా కాలానికి భర్తతో విడిపోయింది. చాలా సంవత్సరాలు సింగిల్ పేరెంట్ గా ఉన్న సునీత  రీసెంట్ గా రెండో పెళ్ళి చేసుకుంది. మ్యాంగో మీడియా గ్రూప్‌ అధినేత రామ్‌ వీరపనేనితో జనవరి 9, 2021 న సునిత పెళ్లి జరిగింది.  ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. 

Latest Videos

click me!