Pushpa 2 : ఆల్రెడీ సాంగ్స్ కంపోజ్ చేశా.. స్క్రిప్ట్ దిమ్మతిరిగిపోద్ది.. దేవీశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published : Aug 29, 2022, 12:37 PM ISTUpdated : Aug 29, 2022, 12:38 PM IST

‘పుష్ఫ 2’ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రం గురించి తాజాగా రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.   

PREV
16
Pushpa 2 : ఆల్రెడీ సాంగ్స్ కంపోజ్ చేశా.. స్క్రిప్ట్ దిమ్మతిరిగిపోద్ది.. దేవీశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) - నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కలిసి నటించిన చిత్రం ‘పుష్ఫ : ది రైజ్’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏరేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందే అందరికీ తెలిసిందే. 

26

ముఖ్యంగా పుష్ఫ సాంగ్స్  వరల్డ్ వైడ్ మోతమోగాయి. ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్, రీల్స్ లలో ట్రెండ్ అయ్యాయి. ప్రధానంగా ‘శ్రీవల్లి’, ‘ఊ అంటావా మామా’ సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.  చాలా రోజుల తర్వాత ఫుల్ చార్ట్ బస్టర్ తో ప్రమఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తన సత్తా చూపించాడు.

36

ఇక ‘పుష్ఫ  2’ (Pushpa The Rule) చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవలనే మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులో సీక్వెల్ ప్రారంభానికి ఘనంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ లోనే షూటింగ్ ప్రారంభించడానికి అన్నీ సిద్ధం చేశారు. 

46

ఈ సందర్భంగా తాజాగా దేవీ శ్రీప్రసాద్ ‘పుష్ఫ 2’ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సినిమా కథ అదిరిపోయిందని, సుకుమార్ కథ చెబుతుంటే చాలా ఎగ్జైట్ ఫీలైనట్టు  తెలిపారు. కథకు అనుకూలంగా ఇప్పటికే మూడు సాంగ్స్ కంపోజ్ కూడా చేశారన్నారు. ఈసారి కూడా దుమ్ములేచిపోద్దని తెలిపారు. 
 

56

పుష్ఫ రాజ్ పాత్రలో అల్లు అర్జున్ మేనరిజం ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. ‘తగ్గేదే లే’ డైలాగ్ కూడా ఎవర్ గ్రీన్ డైలాగ్ గా ఉండిపోయింది. ఈ క్రమంలో పార్ట్ 2లో పుష్ఫ రాజ్ ఎలా ఉండబోతున్నాడు.. ఎలాంటి డైలాగ్స్, ఎలాంటి సాంగ్స్ వినిపిస్తారని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.  

66

‘పుష్ఫ’ బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో సీక్వెల్ ను మరింత గ్రాండ్ గా తెరకెక్కించనున్నారు. ఇందుకు బడ్జెట్ ను కూడా పెంచేశారు. రూ.350 కోట్ల వరకు వెచ్చించనున్నట్టు తెలుస్తోంది. మూవీలో అల్లు అర్జున్, రష్మిక మందన్నతో పాటు ఫహద్ ఫాజిల్, సమంత, ప్రిమణి కూడా ఉంటారని తెలుస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories