జస్సీ వాళ్ళ అమ్మ,జెస్సిని కొట్టి ఇంత దారుణమైన పని చేశావు. మన కుటుంబ పరువును తీస్తున్నావు కదా అని కొడుతుంది.అప్పుడు జెస్సి వాళ్ళ నాన్న,జెస్సి దగ్గరికి వెళ్లి మేము నీకు ఏమీ లోటు చేయకుండా పెంచాము అయినా సరే ఇంత తప్పు చేశావు,ఎవడాడు మర్యాదగా చెప్పు అని అడుగుతాడు జెస్సి మౌనంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న, ఇప్పటివరకు నాలో ఉన్న మంచితనాన్ని చూసావు ఇంకో కోణం కూడా బయటకు వస్తుంది మర్యాదగా చెప్పు అని అనగా అఖిల్ పేరు ఇప్పుడే చెప్తే బాగోదు, అఖిల్ ని అడిగి, మాట్లాడి చెప్డాము అని మనసులో అనుకుంటుంది జెస్సి. అప్పుడు జెస్సి వాళ్ళ డాడీ నేను నీకు సాయంత్రం వరకు సమయం ఇస్తున్నాను వాడు ఎవడో చెప్పకపోతే కథ ఇంకోలా ఉంటుంది అని జెస్సికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు.