భర్తతో సునీత.. క్యాండీడ్‌ ఫోటోని పంచుకున్న సింగర్‌.. నెటిజన్ల ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

First Published | Jun 26, 2021, 4:53 PM IST

సింగర్‌ సునీత్‌ మ్యారేజ్‌ తర్వాత చాలా హ్యాపీగా ఉంది. కెరీర్‌ని ఫుల్‌ స్వింగ్‌లో నడిపిస్తుంది. వరుసగా కొత్త కార్యక్రమాలు చేపడుతుంది. తాజాగా భర్త రామ్‌వీరపనేనితో ఓ క్యాండీడ్‌ ఫోటోని పంచుకుంది. నెటిజన్లు ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేస్తున్నారు.

సింగర్‌ సునీత రెండో వివాహం బాగా కలిసొచ్చినట్టుంది. ఎక్కడ చూసినా సింగర్‌ సునీత సందడే కనిపిస్తుంటుంది. ఓ వైపు సింగర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కంటిన్యూ అవుతూనే ఈ తెలుగులో `డ్రామా జూనియర్స్` అనే షోకి జడ్జ్ గా చేస్తుంది.
మరోవైపు కొత్తగా `పాడుతా తీయగా` తరహాలో మరో పాటల ప్రోగ్రామ్‌ని స్టార్‌ చేయబోతుంది. ఇటీవల సోషల్‌ మీడియాలో రెగ్యూలర్‌గా అభిమానులతో చాట్‌ చేస్తుంది సునీత. వాళ్లు అడిగిన పాటలు పాడుతూ అలరిస్తుంది.

ఇలా కెరీర్‌ పరంగా మరింత బిజీ కాబోతున్న తరుణంలో చాలా రోజుల తర్వాత భర్తతో కలిసి ఉన్న ఫోటోని పంచుకుంది సింగర్‌ సునీత. క్యాండీడ్‌ పిక్‌ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో షేర్‌ చేసింది.
ఇందులో సునీతకి రామ్‌ వీరపనేని ఏదో విషయాన్ని చెబుతున్నట్టుగా ఉంది. ఇద్దరు దానిపై డీప్‌ ఆలోచనలో ఉన్నారు. ఇందులో ఇద్దరు ఇచ్చిన క్లోజ్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దీంతో ఈ ఫోటో వైరల్‌గా మారింది.
దీనిపై అభిమానులు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. పర్‌ఫెక్ట్ కపుల్‌ అని, బెస్ట్ కపుల్‌ అని, మీరు ఇలా మా హృదయాలను దోచేస్తున్నారని, చూడచక్కని జంట అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
సింగర్‌ సునీత.. ప్రముఖ డిజిటల్‌ అధినేత రామ్‌ వీరిపనేని ఈ ఏడాది జనవరిలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటికే సునీతకి వివాహం కాగా, ఆయనకు చాలా ఏళ్ల క్రితం విడాకులిచ్చింది. ఆ తర్వాత రామ్‌ని రెండో వివాహంగా చేసుకుంది.
సునీతకి అప్పటికే ఇద్దరు పిల్లలున్నారు. కుమారుడు ఆకాష్‌, కూతురు శ్రేయా ఉన్నారు. ఆకాష్‌ విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతుండగా, కూతురు సింగర్‌గా తల్లి వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాణించేందుకు ప్రయత్నిస్తుంది.

Latest Videos

click me!