ఇటీవల బిగ్‌బాస్ భామ అరియానాని వివాదాస్పద, సంచలన దర్శకుడు ఓ సంచలన ఇంటర్వ్యూ చేశాడు. వర్కౌట్ సెషన్‌లో దుమారం రేపిన ఈ ఇంటర్వ్యూకి అసలు కారణాలు తెలిస్తే మైండ్ బ్లాంక్ కావాల్సిందే. బోల్డ్ విషయాలను అంతే బోల్డ్ గా చెప్పింది అరియానా.
బిగ్‌బాస్‌తో వచ్చిన అరియానా క్రేజ్‌ని, పాపులారిటీని వర్మ వాడుకుంటున్నాడా? ఆమెతో బోల్డ్ ఇంటర్య్వూ చేయడానికి అసలు కారణమేంటి? అంతిమ ఫలితం ఎవరికి ? విమర్శలెవరికీ? ఇప్పుడిదే హాట్ టాపిక్. దీనిపై తాజాగా అరియానా స్పందించింది. ఓ టీవీ ఇంటర్వ్యూలో వర్మతో ఆ ఇంటర్వ్యూ ఎందుకు చేయాల్సి వచ్చిందో వెల్లడించింది అరియానా.
ఏడాది క్రితం తన జీవితం వేరు, ఇప్పుడు వేరు అని, ఒకప్పుడు సింగిల్ బెడ్‌రూమ్ ప్లాట్, చిన్న కారు ఉండేది. తన జీవితం నాలుగేండ్ల స్ట్రగుల్ అని. తాని దాదాపు 900వందల ఇంటర్వ్యూలు చేశాను. కానీ వర్మతో చేసిన ఇంటర్వ్యూ ఒక్కటే నా జీవితాన్ని మార్చేసిందని చెప్పింది. ఒక్క కామెంట్ వల్ల ఓ షోలో అవకాశం వచ్చింది. ఇంతటి పాపులారిటీ వచ్చిందని చెప్పింది.
ఒక గ్రాటిట్యూడ్‌తో వర్మతో ఇంటర్వ్యూ చేశానని తెలిపింది. తన గ్రాటిట్యూడ్ తనపై ఉంచుకోవడం ఇష్టముండదని తెలిపింది. దీనికి వర్మ సంతోషంగా ఉన్నారు. కానీ ఇంటర్వ్యూలో వర్మ అడిగిన ప్రశ్నలకు అవాక్కయ్యానని తెలిపింది. నా క్రేజ్‌ని ఆయన వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు, ఆయన క్రేజ్‌నే వాడుకున్నాని చెబుతా.
ఈ ఇంటర్వ్యూ పద్ధతిగా లేదనే ప్రశ్నకి స్పందిస్తూ, ఇది ఇంటర్వ్యూ కాదు, జస్ట్ చిట్‌చాట్. అందులో తప్పేంటి? వర్కౌట్‌లో చాలా మంది జిమ్‌లో దిగిన పోస్ట్ లు పెడతారు. హీరోయిన్లు కూడా జిమ్‌లో ఫోటోలు పెడతారు. నేను అలాగే చిట్ చాట్ చేశా. అందులో తప్పేంటి? అంటూ ప్రశ్నించింది అరియానా. జిమ్‌కి వెళ్లాలంటే అలా ఉండాలి, గుడికి వెళ్లాలంటే ఇలా ఉండాలి.. అలా ప్రతి మనిషిలో అన్ని స్టయిల్స్ ఉండాలని చెప్పింది. అందులో అసభ్యం లేదు. ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నాం, వెబ్ సిరీస్ చూస్తున్నాం. వాటిలో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఏవి కనిపించకూడదో, ఏవి కనిపించాలో నాకు తెలుసు.
కాంబినేషన్ బోల్డ్ గా ఉండిందనేది ఒప్పుకుంటా. హౌజ్ వైఫ్స్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. దాన్ని ఒప్పుకుంటా. ఇంటర్వ్యూ చూసి మా అమ్మ ఫస్ట్ టైమ్ ఫోన్ చేసింది. ఇంటర్వ్యూ బాగుందని, కానీ యూట్యూబ్‌లో కొన్ని వీడియోల్లో థంబ్ నెయిల్స్ వల్గారిటీగా పెడుతున్నారని చెప్పినట్టు తెలిపింది అరియానా.
ఇంటర్వ్యూ రిలీజ్ టైమ్‌లో చాలా టెన్షన్ పడ్డట్టు తెలిపింది అరియానా. గాడ్ ఇప్పుడిది ఎలా అవుతుంది, ఎలా వెళ్తుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆందోళన చెందానని తెలిపింది అరియానా. సెక్స్ ఎడ్యూకేషన్ గురించి చిన్నపిల్లలకి తెలియాలని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఇందులో అంత వల్గారిటీ ఏముంది, జస్ట్ చిట్‌చాట్ మాత్రమే కాదా అనిపించింది. కానీ ఓ రోజు నిద్ర కూడా రాలేదని తెలిపింది.
వర్మ అంగాంగ వర్ణన విని అవాక్కయ్యాను. ఏ దేవుడా ఏం చెప్పాలంటూ కంగారు పడినట్టు చెప్పింది అరియానా. అయితే ఆర్జీవీ గురించి తెలుసే ఆ ఇంటర్వ్యూ చేశానని, అలాంటి ప్రశ్నలు ఎదుర్కొవాల్సిందే అని కంటిన్యూ అయ్యాను.
కెమెరా ముందు ఆర్జీవీ వేరు, కెమెరా వెనుక ఆర్జీవీ వేరని చెప్పింది. కెమెరా లేకపోతే ఆయన చాలా ప్రొఫేషనల్ అని పేర్కొంది. ఎక్కువ సేపు మాట్లాడరు. ఆయనది డిఫరెంట్ వరల్డ్ అని చెప్పింది. విలువలున్న మోడ్రన్ రుషీ ఆర్జీవీ. `మీటూ` లాంటి మూవ్‌మెంట్స్ లో కూడా ఒక్కరు కూడా ఆయన పేరుని మెన్షన్ చేయలేదు. అది ఆయన నేచర్ అని పేర్కొంది అరియానా. మొత్తానికి వర్మని వెనకేసుకు వచ్చింది.