అల్లరి అనుపమ, స్టైలిష్ రష్మిక, లెహంగాలో మోనాల్, కుర్తాలో ఈషా... ఆకట్టుకునే సెలబ్స్ సోషల్ మీడియా పోస్ట్స్

First Published | Jun 26, 2021, 4:40 PM IST


ఇది కలియుగం కాదు సోషల్ మీడియా యుగం... సామాన్యుడు నుండి సెలెబ్రిటీకి అలవాటుగా మారిన మాధ్యమం. ఎంత పెద్ద స్టార్ అయినా మరింత పాప్యులర్ కావాలంటే సోషల్ మీడియాలో హల్ చల్ చేయాలి. ఇక హీరోయిన్స్ కి ఇది మరీ అవసరం.. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయడం ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు, దర్శక నిర్మాతల కంట్లో పడవచ్చు... మరి సెలబ్స్ నేటి సోషల్ మీడియా పోస్ట్స్ చూద్దామా 
 

స్టార్ హీరోయిన్ రష్మిక మందాన క్లివేజ్ లుక్ లో బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్ చేసింది. సంథింగ్ అబౌట్ ది బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్... అంటూ క్యాప్షన్ పెట్టి స్టైలిష్ లుక్ ఇచ్చింది. బాలీవుడ్ నుండి కోలీవుడ్ దాకా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న రష్మిక ఫార్మ్ మాములుగా లేదు.
క్యూటీ అనుపమ అల్లరి పిల్లలా నాటీ పోజులిస్తున్న ఫోటోలు షేర్ చేసింది. వదలకుండా వెంటాడుతున్న లాక్ డౌన్, కోవిడ్ పరిస్థితులపై క్రేజీ కామెంట్స్ చేసింది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 18 పేజెస్ మూవీలో అనుపమ నటిస్తున్న విషయం తెలిసిందే.

బిగ్ బాస్ భామ మోనాల్ గజ్జర్ బుల్లితెరపై కనిపించడం మానేశారు. ఆమె జడ్జిగా వ్యవహరించిన డాన్స్ ప్లస్ షో ముగియడంతో ఆమె అక్కడ కనుమరుగయ్యారు. సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తున్నారు. క్రీమ్ కలర్ చోళీ, లెహంగా ధరించి మెరిసిపోయింది మోనాల్.
అతిలోక సుందరి శ్రీదేవి కూతరు జాన్వీ కపూర్ క్లివేజ్ షో తో హాట్ హాట్ చూపులతో రెచ్చగొట్టారు. ఆమె సెక్సీ ఫోటోలు సెగలు రేపేవిగా ఉన్నాయి.
సింగర్ సునీత భర్త రామ్ తో దిగిన  త్రో బ్యాక్ పిక్ పంచుకున్నారు. ఇది ఓ అద్భుతం చిత్రం అంటూ ఆమె ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు.
కుర్రహీరో అర్జున్ కపూర్ తో ప్రేమాయణం నడుపుతున్న ఐటెం భామ మలైకా అరోరా.. అతనితో దిగిన ఫోటో పంచుకున్నారు. అర్జున్ కపూర్ బర్త్ డే నేపథ్యంలో అతనికి ఇలా రొమాంటిక్ గా విషెష్ చెప్పింది మలైకా.
తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా వచ్చిన అవకాశాలు చేసుకుంటూ కెరీర్ లో ముందుకు వెళుతున్నారు. ఇతర బాషలలో ఆమెకు అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. స్లీవ్ లెస్ కుర్తా ధరించిన ఈషా క్లాస్సీ లుక్ లో ఆకట్టుకున్నారు.

Latest Videos

click me!