Published : Dec 07, 2020, 02:04 PM ISTUpdated : Feb 17, 2021, 12:20 PM IST
కొద్దిరోజులుగా సింగర్ సునీత రెండవ వివాహం చేసుకోనున్నారని వరుస కథనాలు రావడం జరిగింది. ఐతే ఈ వార్తలపై సింగర్ సునీత స్పందించలేదు. గతంలో రెండో పెళ్లి ఆలోచన లేదని సునీత చెప్పడంతో ఇవి కేవలం రూమర్స్ మాత్రమే అని చాలా మంది భావించారు.
హఠాత్తుగా నేడు సునీత ఓ వ్యక్తితో నిశ్చితార్ధం జరుపుకొని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం సునీత ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే సునీతను వివాహం చేసుకోబోయే ఈ వ్యక్తి ఎవరనే ఆతృత కూడా అందరిలో మొదలైంది.

27
ఐతే సునీతతో ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఆ వ్యక్తి పేరు రామ్ వీరపనేని అని తెలుస్తుంది. ఈ ఆయన ఒక వ్యాపారవేత్తని సమాచారం. వీరిద్దరి మనోభావాలు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారట.

37
సునీత ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. పిల్లలు మరియు తన భవిష్యత్ కోసం పెళ్లి నిర్ణయం తీసుకున్నట్లు, తన ఆలోచనలను గౌరవించి, తాను బాగుండాలని కోరుకునే పిల్లలు, తల్లిదండ్రులు కలిగి ఉండడం నా అదృష్టం అన్నారు. రామ్ తన జీవితంలోకి రావడంతో భవిష్యత్ పై భరోసా కలిగింది అన్నారు సునీత. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మేము చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. తన ఈ నిర్ణయాన్ని అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు గౌరవించి, సపోర్ట్ చేయాలని అభ్యర్ధన చేశారు.

47
సునీత 19ఏళ్లకే కిరణ్ కుమార్ గోపరాజు అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆకాష్, శ్రేయా అనే ఇద్దరు టీనేజ్ దాటిన పిల్లలు ఉన్నారు. శ్రేయా కూడా పరిశ్రమలో సింగర్ గా ఎదిగే ఆలోచనలో ఉన్నారు.

57
భర్త కిరణ్ తో చాలా కాలం క్రితమే విడిపోయిన సునీత ఒంటరిగా పిల్లలు, తల్లిదండ్రులతో ఉంటున్నారు. ఆర్ధిక విషయాలలో వీరిద్దరికీ విభేదాలు తలెత్తినట్లు తెలుస్తుంది.

67
నేడు నిశ్చితార్థం జరుపుకున్న రామ్ మరియు సునీత పెళ్లి తేదీ త్వరలో ఖరారు చేయనున్నారు. 1995లో వచ్చిన గులాబీ సినిమాలోని ' ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో' పాటను పాడిన సునీత, మొదటి పాటతోనే పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు.

77
17ఏళ్లకే స్టార్ సింగర్ గా ఎదిగిన సునీత ఇప్పటి వరకు 1000కి పైగా పాటలు అనేక భాషలలో పాడారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పదుల సంఖ్యలో హీరోయిన్స్ కి గాత్ర దానం చేశారు.