తన మధుర గాత్రంతో సింగర్ సునీత ఎందరో అభిమానులని సొంతం చేసుకుంది. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. సునీత తన మొదటి భర్త నుంచి విడిపోయి చాలా కాలం సింగిల్ గా ఉన్నారు. అయితే సునీత గత ఏడాది రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రామ్ వీరపనేని అనే వ్యాపార వేత్తని వివాహం చేసుకుని సంతోషంగా గడుపుతోంది.