విధి విచిత్రం... సొంత వదినలు, మరదళ్ళతో  రొమాన్స్ చేసిన స్టార్ హీరోలు!

Published : Sep 17, 2022, 03:53 PM ISTUpdated : Sep 17, 2022, 03:57 PM IST

సినిమాల్లో డిఫరెంట్ కాంబినేషన్స్ సాకారం అవుతూ ఉంటాయి. ఒకప్పుడు లవర్ గా జతకట్టిన అమ్మాయి కొన్నేళ్ల తర్వాత అదే హీరోకి అమ్మగా చేయవచ్చు.  హీరో కూతురిగానో మనవరాలిగానో చేసిన అమ్మాయి పెద్దయ్యాక అదే హీరో పక్కన హీరోయిన్ గానూ చేయవచ్చు. ఇక రియల్ లైఫ్ భార్యాభర్తలు రీల్ లైఫ్ లో అలా నటించడం కూడా చూడొచ్చు.

PREV
16
విధి విచిత్రం... సొంత వదినలు, మరదళ్ళతో  రొమాన్స్ చేసిన స్టార్  హీరోలు!
Bollywood stars

కాగా బాలీవుడ్ లో కొందరు హీరోలు తమ రియల్ లైఫ్ వదినలు, మరదళ్ళతో ఆన్ స్క్రీన్  రొమాన్స్ చేశారు. వాళ్లతో అందమైన డ్యూయట్స్ పాడుకున్నారు. మరి అలాంటి బాలీవుడ్ తారలు ఎవరో చూద్దాం..

26
Bollywood stars

సల్మాన్ ఖాన్ కెరీర్ లో దబంగ్ అతిపెద్ద హిట్. ఈ మూవీలోని ఐటెం నంబర్ '' మున్నీ'' ఓ సెన్సేషన్. సినిమాకు హైలెట్ గా నిలిచిన ఈ సాంగ్ అప్పట్లో దేశాన్ని ఊపేసింది. ఈ పాటలో సల్మాన్ కి జంటగా మలైకా అరోరా కాలు కదిపారు. మలైకా ఎవరో కాదు సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ మాజీ భార్య. ప్రస్తుతం విడాకులు తీసుకొని విడిగా ఉంటున్నారు. సల్మాన్ కి మలైకా వరసకు మరదలు అవుతుంది.

36
Bollywood stars

90లలో అనిల్ కపూర్-శ్రీదేవి బాలీవుడ్ బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. వీరి కాంబినేషన్ లో మిస్టర్ ఇండియా, లమ్హా, లాడ్ల, జుడాయ్ వంటి సూపర్ హిట్స్ తెరకెక్కాయి. ఇక శ్రీదేవి ఎవరో కాదు అనిల్ కపూర్ అన్నగారైన బోనీ కపూర్ భార్య. అనిల్ కపూర్ కి శ్రీదేవి వరసకు వదిన అవుతారు.

46
Bollywood stars

మొదటి భార్య అమృతా సింగ్ కి విడాకులిచ్చిన సైఫ్ అలీ ఖాన్... రెండో వివాహంగా కరీనా కపూర్ ని చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. ఇక కరీనాను వివాహం చేసుకోక ముందు ఆమె అక్క కరిష్మా కపూర్ తో సైఫ్ రొమాన్స్ చేశారు. కరిష్మా-సైఫ్ కలిసి హమ్ సాత్ సాత్ హైన్ మూవీలో కలిసి నటించారు.

56
Bollywood stars

అజయ్ దేవ్ గణ్-రాణి ముఖర్జీ ఆన్ స్క్రీన్ బెస్ట్ కపుల్ అనడంలో సందేహం లేదు. వీరిద్దరూ కలిసి చోరీ చోరీ, ఎల్ ఓ సి కార్గిల్ చిత్రాల్లో  నటించారు. రాణి ముఖర్జీ వరసకు ఆయనకు మరదలు అవుతుంది. అజయ్ దేవ్ గణ్ భార్య కాజోల్ కి రాణి ముఖర్జీ కజిన్ అవుతారు. ఆ విధంగా ఆయన మరదలితో రొమాన్స్ చేశారన్న మాట.

66
uday chopra

నటుడు ఉదయ్ చోప్రా-రాణి ముఖర్జీ కలిసి ముజ్సే దోస్తీ కరోగీ చిత్రంలో నటించారు. ఈ మూవీలో మెయిన్ హీరో హృతిక్ రోషన్. ఉదయ్ చోప్రా సెకండ్ హీరో. రాణి ముఖర్జీ భర్త ఆదిత్య చోప్రా ఉదయ్ చోప్రాకు వరసకు అన్నయ్య. అంటే ముజ్సే దోస్తీ కరోగి మూవీలో వదినతో ఉదయ్ కలిసి నటించారు.

click me!

Recommended Stories