సంపూర్ణేష్ బాబు కు అనారోగ్య సమస్యలు ఉన్నాయా, అందుకే సినిమాలు చేయడం లేదా? క్లారిటీ ఇచ్చిన కామెడీ హీరో

చాలా కాలం అయ్యింది కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు వెండితెరపై కనిపించి. చాలా సాధారణ జీవితం గడిపే ఈ హీరో.. త్వరలో సోదరా సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు సంపూ. ఈక్రమంలో సంపూర్ణేష్ బాబు తనపై వచ్చిన రకరకాల రూమర్స్  విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతకీ సంపూర్ణేష్ బాబు ఏమన్నారు.? ఇన్ని రోజులు సంపూ ఎందుకు కనిపించలేదు? ఏమైపోయారు? 

Sampoornesh Babu Clears Health Rumors, Returns with Sodara Movie in telugu jms

చాలా గ్యాప్ తర్వాత సంపూర్ణేష్ బాబు వెండితెరపై కనిపనించబోతున్నారు. ఆయన  హీరోగా నటిస్తున్న సినిమా సోదరా. మన్‌ మోహన్‌ మేనం పల్లి  డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సంపూ బ్రదర్ గా  సంజోష్‌ నటిస్తున్నాడు.  క్యాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై చంద్ర చగంలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ అంతా పూర్తయ్యి రిలీజ్ కు రెడీ అయ్యింది ఈమూవీ.  ఏప్రిల్ 25న థియేటర్లలో ఈమూవీ రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరలో ఉండటంతో  ప్రమోషన్స్ ను పరుగులు పెట్టిస్తున్నారు టీమ్. ఈక్రమంలో చాలా రోజులు తరువాత హీరో సంపూర్ణేష్ బాబు వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. 

Also Read: నయనతార వల్ల 50 కోట్లు నష్టపోయిన నెట్‌ఫ్లిక్స్‌ ? అసలు సంగతి ఏంటంటే?

Sampoornesh Babu Clears Health Rumors, Returns with Sodara Movie in telugu jms
Sampoornesh babu

అయితే చాలా కాలంగా సంపూర్నేష్ బాబు కనిపించడంలేదు. ఆయన స్క్రీన్ కు దూరం అయ్యారన్న రూమర్స్ తో పాటు, సంపూర్ణేష్ బాబు ఆరోగ్యం పాడైయ్యిందని, ఆర్ధిక ఇబ్బందుల్లో పడిపోయాయని, ఇంటికే పరిమితం అయ్యారన్న వార్తలు వైరల్ అయ్యాయి. దానికి తగ్గట్టే సంపూ ఎక్కడా కనిపించలేదు, సిద్దిపేటలో ఉంటూనే సాధారణ జీవితం గడపడం స్టార్ట్ చేశారు. దాంతో ఈ వార్తలు ఎక్కువైపోయాయి. దాంతో తాజాగా సోదర సినిమా ప్రమోషన్స్ లో  పాల్గొంటూ సంపూ ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు. తన ఆరోగ్యానికి సబంధించిన విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. 

Also Read:  సినిమాకు 200 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే ఖరీదైన విలన్ ఎవరో తెలుసా?


తాజాగా ఓ ఇంటర్వ్యూల్లో పాల్గొన్న సంపూర్ణేష్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. హీరోగా 11 ఏళ్లు పూర్తి చేయడం నాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ ప్రయాణం చాలా హ్యాపీగా అనిపిస్తోంది . సినిమాల కారణంగా నాకు ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. అయితే ఆ క్రేజ్ ను ఎంజాయ్ చేయలేకపోయానని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ నా భార్య ఉమారాణి మిషన్ కుడుతుంది. మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒకరు బీటెక్ .. మరొకరు ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. 

Also Read:  ప్రభాస్ లాంటి కొడుకు కావాలంటున్న స్టార్ హీరోయిన్ ఎవరు?

Sampoornesh Babu

నేను యాక్టర్ ను అని గర్వం ఎప్పుడూ లేదు. నా పిల్లలు కూడా అలాగే ఉంటారు, నరసింహాచారి పిల్లలుగానే సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకూ నా పేరును ఎక్కడా బయటకు రాకుండా చూసుకుంటారు,నా లాగా వారు కూడా బస్సులలో .. ఆటోలలో కూడా తిరుగుతూ ఉంటారు.

నిజం చెప్పాలంటే వాళ్లు అలా ఉండటమే నాకు కూడా నచ్చుతుందని అన్నారు సంపూ. అంతే కాదు  నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. నేను అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాననే రూమర్లు వినిపిస్తున్నాయి. 

Also Read:  సింగర్ సునీత కు ప్రవస్తి కౌంటర్, సైగలు చేసుకుని మరీ నాకు అన్యాయం చేశారు, వాళ్లు ఎలా టాప్ లో ఉన్నారు?

Sampoornesh Babu new movie

అయితే అందులో ఎలాంటి నిజం లేదు. నేను సినిమాలు చేశాను. అయితే అనుకున్న సమయానికి అవి రిలీజ్ కాకపోవడం వలన అలాంటి ప్రచారం జరిగింది. నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు అన్నారు.  సినిమాలు లేకుంటే సంపూర్ణేష్ బాబు తన సొంత ఊరు సిద్దిపేట వెళ్ళిపోతారు. షూటింగ్ ఉంటనే హైదరాబాద్ లో ఉంటారు. లేదంటే సిద్దిపేట వెళ్లి.. అక్కడ సాధారణజీవితం గడుపుతారు.

తమ కులవృత్తి అయిన గోల్డ్ వర్క్ చేసుకుంటుంటారు సంపూర్ణేష్ బాబు. ఇలా సింపుల్ గా ఉంటూ అందరికి ఆదర్శంగా ఉంటున్నారు సంపూర్ణేష్ బాబు. ఏదైన ప్రకృతి విపత్తులు వస్తే.. ముందుగా స్పందించేది సంపూనే. ఆతరువాతే ఏ స్టార్ హీరో అయినా సాయం ప్రకటిస్తుంటారు. 

Also Read: పహల్గాం ఉగ్రదాడి ప్రాంతంలో షూటింగ్స్ జరిగిన 9 సినిమాలు ఏవో తెలుసా?

Latest Videos

vuukle one pixel image
click me!