సింగర్ మంగ్లీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకూ ఆమె పాడిన ప్రతీ పాట సూపర్ హిట్టే.. ప్రతీ ఆల్భం సూపర్ సక్సెస్ అవుతూ వస్తోంది. జానపద పాటలకు పెట్టింది పేరుగా మారిపోయింది మంగ్లీ. ఆమె వాయిస్ లోని హస్కీనెస్ మంత్రముగ్ధుల్ని చేస్తుంటుంది. సినిమాపాటలతో పాటు.. ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ.. స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది మంగ్లి.