Singer Jhansi Remuneration: సింగర్‌ ఝాన్సీ బిగ్‌ బాస్‌ పారితోషికం.. 8 వారాలకు ఇంతేనా?

Published : Nov 01, 2026, 08:40 AM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఎనిమిదో వారం రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. మరి ఎనిమిది వారాలు హౌజ్‌లో ఉన్న ఆమెకి ఎంత పారితోషికం దక్కుతుందంటే?

PREV
13
బిగ్‌ బాస్ 10 8వ వారం ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్ లు

బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌ ఊహకందని విధంగా నడుస్తుంది. ఎప్పటికప్పుడు ట్విస్ట్ లు, టర్న్ లతో రన్‌ చేస్తున్నారు. దీంతో ఆసక్తి పెరుగుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. ఇది షో రేటింగ్‌ పెరగడానికి ఉపయోగపడుతుంది. సీజన్‌ 10.. ట్విస్ట్ లు, టర్న్ లు 10 టైమ్స్ ఉంటాయని నాగార్జున చెబుతూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఎలిమినేషన్‌ విషయంలో మాత్రం మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఎనిమిదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌ అయిన విషయం తెలిసిందే.

23
సింగర్‌ ఝాన్సీ ఎలిమినేట్‌

ఎనిమిదో వారంలో మొదటగా సింగర్‌ ఝాన్సీ ఎలిమినేట్‌ అయ్యింది. శనివారం ఎపిసోడ్‌లోనే ఆమెని ఎలిమినేట్‌ చేశారు. ఆదివారం ఎపిసోడ్‌లో మరో ఎలిమినేషన్‌ ఉంటుందట. ఇందులో రోహిత్‌ ఎలిమినేట్‌ అయినట్టు సమాచారం. అయితే ఆయన్ని సీక్రెట్‌ రూమ్‌కి తరలించారని సమాచారం. ఇదిలా ఉంటే ఎనిమిది వారాలు ఉన్న సింగర్‌ ఝాన్సీ బిగ్‌ బాస్‌ నుంచి ఎంత పారితోషికం అందుకుంటుందనేది చూస్తే, ఆమె కామనర్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టారు. అగ్నిపరీక్ష ద్వారా సక్సెస్‌ అయి, దాన్నుంచి బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి వచ్చింది ఝాన్సీ. రైతు బిడ్డగా ఆమె పాపులర్‌ అయ్యింది. అయితే దాన్ని కొంత మంది నెగటివ్‌గా పోట్రే చేశారు. ప్రారంభంలో ఆటలో తన జోరు చూపించిన ఝాన్సీ క్రమంగా డౌన్‌ అయ్యింది. గత రెండు వారాలుగా పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదు. దీంతో ఇది ఆమె ఎలిమినేషన్‌కి దారితీసిందని చెప్పొచ్చు.

33
సింగర్‌ ఝాన్సీ పారితోషికం

ఇక ఎనిమిది వారాలపాటు హౌజ్‌లో ఉన్న సింగర్‌ ఝాన్సీ ఎంత పారితోషికం తీసుకుందనేది చూస్తే, ఆమెకి వారానికి రూ.70-75వేల పారితోషికం ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ లెక్కన ఎనిమిది వారాలకు దాదాపుగా రూ.5.60-6 లక్షల వరకు పారితోషికం అందుకుంటుందని తెలుస్తోంది. కామనర్స్ అందరికి ఒకే పారితోషికం నిర్ణయించారు. సెలబ్రిటీలకంటే వీరికి తక్కువగా ఇస్తున్నారు. దీంతో ఎనిమిది వారాలున్నప్పటికీ కేవలం ఆరు లక్షల లోపే పారితోషికం దక్కడం గమనార్హం. ఇదిలా వరుసగా కామనర్స్ ఎలిమినేట్‌ అవుతున్నారు. కావాలనే వారిని హౌజ్‌ నుంచి పంపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇక హౌజ్‌లో రోహిత్‌తోపాటు అమన్‌ మాత్రమే కామనర్‌ నుంచి వచ్చిన కంటెస్టెంట్లు ఉన్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories