రజనీకాంత్ హీరోగా రూపొందిన `జైలర్ 2` మూవీ బాక్సాఫీసు వద్ద తన జోరు చూపిస్తోంది. మూడు వారాలు అవుతున్నా, ఈ చిత్రం బాక్సాఫీసుని షేక్ చేస్తుండటం విశేషం. 17 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `జైలర్ 2` మూవీకి ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రం విడుదలై మూడు వారాలు అవుతున్నా కూడా, బాక్సాఫీసు వద్ద జోరు ఏమాత్రం తగ్గడం లేదు. అదిరిపోయే వసూళ్లతో రన్ అవుతుంది. రోజుకి ఇంకా పది కోట్లకుపైగానే కలెక్షన్లు వస్తుండటం విశేషం. ఇక తాజాగా ఈ సినిమా 17 రోజులు పూర్తి చేసుకుంది. 17వ రోజు శనివారం దీనికి దాదాపు రూ.13.90కోట్లు రావడం విశేషం. బాక్సాఫీసు వద్ద ఇంకా స్ట్రాంగ్‌గా రన్ అవుతుందనడానికిది నిదర్శనం.
24
జైలర్ 2 టోటల్ కలెక్షన్లు
ఇక `జైలర్ 2` మూవీ ఇప్పటి వరకు రూ.790.85కోట్లు వసూలు చేసింది. తమిళ చిత్ర పరిశ్రమలో సంచలన చిత్రంగా నిలిచింది. కోలీవుడ్ లో అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా `2.0` ఉండగా, ఆ సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. సరికొత్త సంచలనం సృష్టించింది. అంతేకాదు కోలీవుడ్‌కి సాధ్యం కాని రికార్డుల వేట దిశగా వెళ్తోంది. ఈ చిత్రం ఇప్పటి వరకు ఇండియాలో రూ.520.35కోట్ల గ్రాస్‌ని, రూ.444.75కోట్ల నెట్‌ని సాధించింది.
34
జైలర్ 2 స్టేట్ వైడ్ కలెక్షన్లు, తెలుగులో ఎంతంటే?
భాషల వారిగా చూస్తే, ఈ మూవీ తమిళంలో రూ.203.95కోట్లు, తెలుగులో రూ.93.85కోట్లు, కర్నాటకలో రూ.90కోట్లు, కేరళాలో రూ.76.20కోట్లు, హిందీలో రూ.56.35కోట్లు వసూలు చేసింది. హిందీలో, కేరళాలో ఈ చిత్రానికి ఊహించని విధంగా కలెక్షన్లు రావడం విశేషం. ఇక ఓవర్సీస్‌లో దుమ్ములేపింది. అక్కడ ఈ మూవీకి రూ.270.50కోట్లు రావడం విశేషం. ఈ సినిమా అన్ని ఏరియాలోనూ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తెలుగులోనూ లాభాల్లో వెళ్తోంది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తెలుగులోనూ అత్యధిక వసూళ్లు రాబట్టిన తమిళ మూవీగా నిలవడం విశేషం. దాదాపు రూ.300కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు లాభాల పంటపండిస్తోంది. ఇప్పటికే దీనికి థియేట్రికల్‌గా వంద కోట్లకుపైగా లాభాలు రావడం విశేషం.
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన `జైలర్ 2` చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా ఇందులో రమ్యకృష్ణ ఆయనకు జోడీగా నటించింది. అలాగే ఎస్ జే సూర్య, విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి, మిర్నా వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి గెస్ట్ రోల్స్ చేశారు. నిర్మాత కళానిధి మారన్ తన సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 15న ఈ చిత్రం విడుదలయ్యింది. మూడేళ్ల క్రితం వచ్చిన `జైలర్` మూవీ పెద్ద హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా ఈ `జైలర్ 2`ని రూపొందించారు.