సింగీతం శ్రీనివాసరావు 1931లో జన్మించారు. 1972లో `నీతి నిజాయితీ` చిత్రంతో దర్శకుడిగా మారారు. తమిళంలో రూపొందించిన `దిక్కత్ర పార్వతి` మూవీ జాతీయ అవార్డు అందుకుంది. ఆ తర్వాత `అమెరికా అమ్మాయి`, `తరం మారింది`, `పంతులమ్మ`, `అమావాస్య చంద్రుడు`, `ఆంధ్రా కేసరి`, `వసంత గీతం`, `మయూరి`, `అమెరికా అబ్బాయి`, `పుష్పక విమానం`, `ఆదిత్య 369`, `బృందావనం`, `భైరవ ద్వీపం`, `శ్రీకృష్ణార్జున విజయం`, `విజయం`, `వెల్ కమ్ ఒబామా` వంటి తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళంలో కూడా సినిమాలు రూపొందించారు. దర్శకుడిగానే కాదు, నటుడిగా, సంగీత దర్శకుడిగా, రైటర్‌గా రాణించారు.