తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇద్దరు మహానుభావులైన ఎన్టీఆర్, భానుమతి కలిసి చాలా సినిమాల్లో పోటా పోటీగా నటించారు.వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటించి న తాతమ్మ కల సూపర్ హిట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా సమయంలో భానుమతి.. ఎన్టీఆర్ కి ఊహించని షాక్ ఇచ్చారు.
ఎన్టీఆర్, భానుమతి కలిసి నటించిన తాతమ్మ కల సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ నందమూరి ఫ్యామిలీకి చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే... ఈ మూవీతోనే బాలకృష్ణ తన మూవీ కెరీర్ ని ప్రారంభించారు. ఎన్టీఆర్ కి మనవడు పాత్రలో నటించారు. హరికృష్ణ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. కాగా.. ఈ మూవీ రెమ్యూనరేషన్ విషయంలో.. ఎన్టీఆర్ కి భానుమతి ఊహించని షాక్ ఇచ్చారు.
23
రెమ్యూనరేషన్ కి భానుమతి కండిషన్..
తాతమ్మ కల సినిమాలో తాతమ్మ పాత్రకు భానుమతిగారిని తీసుకోవాలని ఎన్టీఆర్ అనుకున్నారంట. అయితే.. ఈ పాత్ర చేయడం ఆమెకు ఇష్టమో లేదో, రెమ్యునరేషన్ ఎంత కావాలో అడగమని రైటర్ డీవీ నర్సరాజు ని పంపించారట. అయితే.. భానుమతి గారు.. ‘ హీరో ఎన్టీఆర్ కాబట్టి.. ఆయన రెమ్యూనరేషన్ కంటే ఒక ఐదు వేలు తక్కువ ఇవ్వండి చాలు’ అని చెప్పి పంపారట.
ఎన్టీఆర్ గారు తనకంటే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవాలని భానుమతి గారు అనుకోవడం వెనుక ఆమె అహంకారం లేదు, ఆమె సీనియారిటీ, ఆ పాత్రపై ఆమెకు ఉన్న గుర్తింపు ఉంది. ఎన్టీఆర్ గారు అప్పట్లో టాప్ హీరో అయినప్పటికీ, భానుమతి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి (నటి, గాయని, దర్శకురాలు). ఆమె పెట్టిన కండిషన్ విన్న ఎన్టీఆర్ గారు తెలివిగా.. తన రెమ్యునరేషన్ కేవలం 2 లక్షలే అని చెప్పి.. ఆమెకు రూ.1.95 లక్షల చెక్ పంపించారు.
33
భానుమతి దిబ్బతిరిగే ట్విస్ట్...
అయితే.. భానుమతి గారు ఆ చెక్ తీసుకొని.. 1.95లక్షలకు మరో పది వేలు కలిపి రెండు లక్షల ఐదు వేల రూపాయలకు మరో చెక్ రాసి.. ఎన్టీఆర్ గారెకి పంపారంట. ఆ చెక్ పంపుతూ.. తాను ఈ తాతమ్మ కలలో నటించాలంటే.. తన తరువాతి సినిమా అమ్మాయికి పెళ్లి లో నటించాలని కండిషన్ పెట్టారట. భానుమతి ఇచ్చిన షాక్ కి ఎన్టీఆర్ షాక్ అయ్యారు. ఎందుకంటే.. అప్పటికే ఎన్టీఆర్ తన సినిమాకి 4 నుంచి 5 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కానీ.. భానుమతి రెమ్యూనరేషన్ తగ్గడానికి.. తాను తక్కువ తీసుకుంటున్నట్లు అబద్ధం చెప్పారు.
మాట తప్పని ఎన్టీఆర్..
అప్పట్లో 4-5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకునే ఎన్టీఆర్ గారు, కేవలం 2 లక్షలకే (అంటే సగం కంటే తక్కువ) భానుమతి గారి సినిమా చేశారు. ఇచ్చిన మాట కోసం ఆర్థిక లాభాన్ని వదులుకొని మరీ.. ఎన్టీఆర్ అమ్మాయి పెళ్లి సినిమా చేయడం గమనార్హం..