Nandamuri Heroes Net Worth: నందమూరి హీరోలకు మతిపోయే ఆస్తులు.. ఎన్టీఆర్‌ కి బాలయ్య ఝలక్‌

Published : Feb 03, 2026, 04:40 PM IST

నందమూరి ఫ్యామిలీలో ప్రస్తుతం ముగ్గురు హీరోలు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారు. వారిలో బాలయ్య, ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ ఉన్నారు. వీరిలో ఎవరి ఆస్తి ఎంత అనేది తెలుసుకుందాం. 

PREV
14
నందమూరి హీరోల ఆస్తులు

టాలీవుడ్‌ లో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్‌ నుంచి నందమూరి ఫ్యామిలీ సినిమా పరిశ్రమలో ప్రముఖ స్థానంలో ఉంది. ఆయన వారసులుగా చాలా మంది సినిమాల్లోకి వచ్చారు. బాలకృష్ణ, హరికృష్ణతోపాటు ఇతర కొడుకులు కూడా సినిమా రంగంలో ఉన్నారు. కానీ బాలయ్య సక్సెస్‌ అయినట్టుగా ఎవరూ కాలేదు. అయితే మూడో తరంలో ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ హీరోలుగా రాణిస్తున్నారు. మరి ఈ నందమూరి హీరోల్లో ఎవరి ఆస్తి ఎంత? ఎవరికి ఎక్కువ ఉన్నాయనేది చూస్తే.

24
నందమూరి బాలకృష్ణ ఆస్తులు

బాలకృష్ణ.. నందమూరి తారక రామారావు వారసుడిగా సినిమాల్లోకి వచ్చారు. ఇటీవలే ఆయన యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటి వరకు 110 సినిమాల చేశారు. చివరగా ఆయన `అఖండ 2` తో అలరించారు. ఈ మూవీ సరిగా ఆడలేదు. ఇప్పుడు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. అయితే నందమూరి నట వారసుడిగా రాణిస్తున్న బాలయ్యకి ఉన్న ఆస్తులు చూస్తే దాదాపు రూ.950కోట్లు ఉంటాయని అంచనా. ఆయనకు వారసత్వంగా ఎన్టీఆర్‌ నుంచి కొన్ని ఆస్తులు వచ్చాయి. స్టూడియోలు, ల్యాండ్స్, కాంప్లెక్స్ లు వచ్చాయట. దీనికితో ఆయన సినిమాల ద్వారా కొంత సంపాదించారు. మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా మొత్తంగా సుమారు వెయ్యి కోట్ల వరకు సంపాదించినట్టు సమాచారం.

34
ఎన్టీఆర్‌ ఆస్తులు

నందమూరి ఫ్యామిలీలో హీరోలుగా రాణిస్తున్న బాలయ్య తర్వాత ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌లు మాత్రమే. మరి ఇందులో తారక్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్‌ నీల్‌తో సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్‌ సినిమాల్లోకి వచ్చి దాదాపు రెండున్నర దశాబ్దాలు పూర్తయ్యింది. ఈ క్రమంలో ఆయన ముప్పై సినిమాలు చేశారు. పారితోషికం రూపంలో బాగానే అర్థించారు తారక్‌. దీనికితోడు తండ్రి హరికృష్ణ వారసత్వంగా కొంత ఆస్తి వచ్చే అవకాశం ఉంది. ఇలా అన్నీ చూస్తే ఎన్టీఆర్‌ ఆస్తులు రూ.500కోట్లు ఉంటాయని అంచనా. అయితే ఎన్టీఆర్ ఎక్కువ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం.

44
కళ్యాణ్‌ రామ్‌ ఆస్తులు

నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా రాణిస్తున్న మరో నటుడు కళ్యాణ్‌ రామ్‌. ఆయన కూడా స్టార్‌గా రాణిస్తున్నారు. అయితే ఇటీవల సక్సెస్‌లు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. `బింబిసార 2` చేసే పనిలో ఉన్నారు. దీనికితోడు తాత ఎన్టీఆర్‌ పేరుతో నిర్మాణ సంస్థని స్థాపించారు. ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. ప్రొడ్యూసర్‌గా కళ్యాణ్‌ రామ్‌ నష్టాల్లోనే ఉన్నట్టు సమాచారం. కళ్యాణ్‌ రామ్‌ కూడా రెండున్నర దశాబ్దాలుగా హీరోగా రాణిస్తున్నారు. సినిమాల పరంగా, వారసత్వంగా వచ్చే ఆస్తులు కలుపుకుని కళ్యాణ్‌ రామ్‌కి మొత్తంగా రూ.400కోట్ల వరకు ఆస్తులుంటాయని సమాచారం. నందమూరి హీరోల్లో బాలయ్యకే ఎక్కువ ఆస్తులున్నాయని తెలుస్తోంది. ఇది కేవలం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం మాత్రమే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories