ఎంతటి భారీ చిత్రం అయినా, స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరే ముందు ఆ చిన్నారి కనిపిస్తేనే సినిమా మొదలవుతుంది. ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు అన్ని సినిమాలు చూడకపోవచ్చు కానీ.. వెండి తెరపై ఆ పాపని పలుమార్లు చూసి ఉంటారు. ఈ రేంజ్ లో చెబుతున్నారు ఎవరా చిన్నారి అనుకుంటున్నారా.. సినిమా ప్రారంభం అయ్యే ముందు ధూమపానం గురించి వచ్చే యాడ్ అందరికి తెలుసు.